తెలుగు వారికి నా విఙ్ఞప్తి
తెలుగువారికీ, ముఖ్యంగా తెలుగు బ్లాగరు సోదరులకీ, నేను సంస్కృత/తెలుగు వ్యాకరణాలూ, ఇంగ్లీషు గ్రామరూ బోధిస్తున్నాను అనుకోక, నా చెప్పు ముక్కలు తమ చెవిని వేసుకొని, ఆలోచించమని ప్రార్థన.
సంస్కృతంలోనైనా, తెలుగులోనైనా, నామవాచకాలు, సర్వనామాలూ వగైరాలు వున్నాయి. నామ వాచకమంటే, ఓ వ్యక్తి, వస్తువు లకు వ్యవహరింపబడే పేర్లు. సర్వనామాలంటే, ఆ నామవాచకాలని మళ్లీ మళ్లీ చెప్పవలసిన అవసరం లేకుండా, ప్రత్యామ్నాయంగా వాడే పదాలు.
ఓ నామవాచకం యొక్క స్థితిని తెలియచెయ్యడానికి సంస్కృతంలో "శబ్దాలూ", తెలుగులో "విభక్తులూ" వున్నాయి. అదే ఇంగ్లీషులో ఆ స్థితి వాచకాలు కూడా భాషా భాగాల్లో ఒకటిగానే వున్నాయి.
వుదాహరణకి, సంస్కృతంలో "రామః = రామ నామం కల వ్యక్తి". అదే తెలుగులో, "డు, ము, వు, లు--ప్రథమా విభక్తి" చేరి, "రాముడు" అవుతుంది ఆ వ్యక్తి పేరు. (ఛీ! యేకవచనమేమిటీ? శ్రీ రాములవారు.....అనాలి అందామా? ఈనాడు వారిలాగ?)
రాముని (ద్వితీయ), చేత (తృతీయ), కొరకు (చతుర్థీ), వలన (పంచమీ), కి, యొక్క (షష్ఠి), యందు (సప్తమీ)--కాకుండా "వాణ్ని" పిలవాలంటే, "ఓ రామా!"; "ఓరి రామా"; "ఓయి రామా" అనీ, అదే సీతనైతే, "ఓసి సీతా" అనే పిలవాలి--మన తెలుగు వ్యాకరణం ప్రకారం!
అంతేగాని, "రాములూ" వగైరా బహువచన ప్రయోగం యెందుకు?
అదే ఇంగ్లీషులో అయితే, 'ప్రిపొజిషన్స్' అని భాషాభాగాల్లోనే చేర్చుకొన్నారు వాళ్లు. "బై రామా", "ఫర్ రామా" ఇలాగ.
గత కొన్నేళ్లుగా, ప్రైవేటు కళాశాలలవాళ్లు "స్కోరింగు" సబ్జెక్ట్ గా సంస్కృతం తీసుకోమని ప్రోత్సహిస్తున్నారట. మరి ఆ విద్యార్థులు ఆ "శబ్దాలనీ" వాటినీ సరిగ్గా వుచ్చరించగలుగుతున్నారో, వ్రాయగలుగుతున్నారో లేదోదానీ, మార్కులు మాత్రం వచ్చేస్తున్నాయట. అదే తెలుగులో 40 వేలమందికి పైగా "సున్నాలు" తెచ్చుకొన్నారట! రావూ మరి?! సంస్కృతం "రాని" మేష్టర్ల కన్నా, తెలుగు "రాని" మేష్టర్ల సంఖ్య యెక్కువ!
మరి సర్వనామాలు, తెలుగులో, "అతడు, అమె, అది, ఆ" అనేవి. ఇంగ్లీషులో, "హి, షి, ఇట్, దె" అనేవి.
తెలుగులో గ్రాంథికంలో అతడు, ఆమె అనేవి వాడినా, వ్యావహారిక భాషలో, వాటికి ప్రత్యామ్నాయంగా, వాడు,అది వారు/వాళ్లు అనే ప్రయోగాలు వచ్చేశాయి.
తెలుగు సాహిత్యం లో కూడా, భగవంతుణ్ని అయినా, వాడు, వీడు అనే అంటారు. "కలడు, కలండనెడి 'వాడు' కలడో, లేడో!" అనీ, "బ్రోచేవారెవరు 'రా'..." అని!
ఇంగ్లీషులో కూడా, వుదాహరణకి, "జీసస్ ఈస్ ది సన్ ఆఫ్ గాడ్. హి (వాడు/అతడు) శాక్రిఫైస్డ్ హిస్ లైఫ్ ఆన్ ది క్రాస్" అంటారు కదా?
"మహాత్మా గాంధీ సత్యాగ్రహాన్నే ఆయుధం చేసుకొన్నాడు. మన దేశానికి స్వాతంత్ర్యం తెచ్చాడు".....అంటారు గానీ, "మహారాజశ్రీ మహాత్ములవారు గాంధీగారు"....చేసుకొన్నా"రు"....తెచ్చా"రు" అంటారా?
ఇక, వా 'రు'; తమ'రు' లాంటి ప్రయోగాలు మన బానిసతనానికి చిహ్నంగా భాషలోకి ప్రవేశపెట్టబడ్డవి. అప్పటి దేశపాలకులని, అప్పటి బానిస వ్యక్తులు అనవసరంగా కీర్తిస్తూ వాడిన పదాలవి. "సర్" ని "అయ్యా"/"ఆర్యా" అనీ;(మ్లేఛ్ఛుడు ఆర్యుడు యెలా అవుతాడు?) "నువ్వు" (ఇంగ్లీషులో యు) ని మీ'రు' అనీ, మళ్లీ ఆ మీరు ని తమ 'రు' అనీ; "ఘనతవహించిన"; "మహాఘనతవహించిన"; "శాయంగల విన్నపములు"; "దయయుంచి" (ప్లీజ్); "కరుణతో" (కైండ్లీ); "దఖలు"/"దాఖిలు"/"దాఖలు" చేస్తున్నాను (సబ్మిట్); (హిందీలో దాఖిల్ కర్నా అంటే విన్నపం చేస్తున్నాను, లేదా, మీ దృష్టికి తెస్తున్నాను/సమర్పిస్తున్నాను అని).
ఇవన్నీ అవసరమా?
{ఇప్పటి ఆఫీసుల్లో కూడా, ఇంగ్లీషులో యేదైనా వ్రాస్తే, దాంట్లో యెన్ని 'రిక్వెస్టులూ', 'ప్లీజ్ లూ', 'కైండ్లీలూ', 'సబ్మిట్ లూ' వున్నాయో చూసుకొని, పైన 'రెస్పెక్టెడ్' వుందా లేదా చూసుకొని, చివర థాంకింగ్ యూ తరవాత "సర్" వుందా లేదా చూసుకొని, అవన్నీ లేకపోతే, "వీడు వొట్టి (స్వంత చిరునామా లేనివాళ్లని--కేరాఫ్ గాళ్లనీ 'అనామకం గాడు (నస్మరంతి)' అనే అనుకుంటా బాపూ-రమణలు అన్నది) ఇన్ సబార్డినేట్ గాడు" అని ముద్రవేసేస్తారు!}
చెప్పొచ్చేదేమిటంటే, మనం ఇంగ్లీషు వాళ్లమూ కాదు, భారతీయులమూ కాదు, తెలుగు వాళ్లమూ కాదు--ఓ ప్రత్యేక జాతి!
ఈ దౌర్భాగ్యాలు మనని వదిలేదెప్పుడో??!!
20 comments:
ఉదాహరణ
ఏకవచనప్రయోగం
well said sir.
Telugu is the only language that don't unite people (particularly when they are out side the State/Country).
Typically at work places (out side India), Telugu person make friendship with a Tamil or North Indian and avoids/mistrusts other fellow Telugu.
"ఏకవచన ప్రయోగం" అని ఉండాలి "యేక" కాదు
పై మొదటి అన్నోన్!
మీది యే తెలుగో, యే వ్యాకరణం చదివారో నాకు తెలీదు.
అయినా, సంతోషం.
ధన్యవాదాలు.
పై రెండో అన్నోన్!
మీ అనుభవం బాగానే వుంది. నాతో కొంత యేకీభవించినందుకు సంతోషం.
నేను మాత్రం, మొన్నటి మా వుత్తరదేశ యాత్రల్లో సైతం, అందరితోనూ తెలుగులోనే మాట్లాడాను....రైల్లో అవీ ఇవీ అమ్మేవాళ్లతో సహా....ఒక్క పోలీసాడి తో తప్ప! (చచ్చినట్టు అర్థం చేసుకుంటారు!)
చూద్దాం....తెలుగు ఇంకెంత అభివృధ్ధి చెందుతుందో.
ధన్యవాదాలు.
శివగారూ!
క్షమించండి. నా తెలుగు నాది. మీరు నిర్బంధించినా, కొన్ని పదాల తొలి అక్షరాలని అచ్చుల్లో వ్రాయలేను, వ్రాయను.
అయినా మీరు కూడా "అసలు విషయం వదలిపెట్టి......." లో చేరిపోతున్నారా యేమిటి?
అనేక ధన్యవాదాలు.
హేమన్నారూ, హవును మీ తేలుఘు మ్హీ హిష్టం హష్టాలాగే ఖానివ్వండి, మీ వంతు భాషా సేవే మ్హీరూ చెయ్యండి. ఖొత్త ఖొత్త ప్రయోఘాలు తయారు చేసెయ్యండి
శివగారూ!
ఇప్పుడు మీరు వ్రాసిన తెలుగు ఇంకా బాగుంది.
నాకంతవొద్దుగానీ, వొదిలేద్దురూ!
ఏకవచన ప్రయోగం అని రాసినప్పటికీ, చదివేటప్పుడు మాత్రం నూటికి 90 మంది యేక వచన ప్రయోగం అంటున్నారని మాత్రం గమనించాను.:-))
గురువుగారూ...
అచ్చుతో ప్రారంభం అయ్యే పదం వాక్యం మొదట్లో ఉంటే అచ్చుతోనూ, వాక్యం మధ్యలో ఉంటే హల్లుతోనూ రాయాలీ, పలకాలీ... అని మా నాన్నగారు చెప్పినట్టు గుర్తు. (ఆయన నిజమైన తెలుగు మాస్టారు, నా తెలుగు అంతంత మాత్రమే)
ఫణీంద్ర పి, ఈటీవీ
(అన్నట్టు, ఈనాడు మీద మీకు ప్రేమ కొంచెం ఎక్కువే ఉన్నట్టుందే! హ్హ హ్హ హ్హ)
""ఇంగ్లీషులో కూడా, వుదాహరణకి, "జీసస్ ఈస్ ది సన్ ఆఫ్ గాడ్. హి (వాడు/అతడు) శాక్రిఫైస్డ్ హిస్ లైఫ్ ఆన్ ది క్రాస్" అంటారు కదా?""
తెలుగు బైబిల్లో మీరు ఎక్కడ చూసినా సరే, ప్రభువు యేసుక్రీస్తు గురించి ప్రస్థావించినప్పుడు అది ఎప్పుడూ “ ఆయన” అనే ఉదహరిస్తుంది. “ వాడు” అనికానీ లేక “ అతను” అని కానీ ఆయన గురించి ఎప్పుడూ యేకవచనంలో సంబోధించడం ఆంగ్ల బైబిల్లో కానీ తెలుగు బైబిల్లో కాని జరగలేదు. కొంచం జాగ్రత్తగా చూస్తే గమనించగలరు.
That is always “He” with the capital letter. Please do observe.
డియర్ సుజాత!
చాలా కాలానికి మళ్లీ....!
మన తెలుగులో వున్న సౌలభ్యం, దాని గొప్పతనం అదే అనీ, మనం యేమి పలుకుతామో అది వ్రాయగలం, యేమి వ్రాస్తామో అది పలుకగలం....."త్పృవ్వట బాబా...." తో సహా అని ఇదివరకే వ్రాశాను.
దాన్నే నేను అనుసరిస్తాను. అందుకే "నా తెలుగు నాది" అని గర్వంగా అనగలిగాను. ఇంకా, కందుకూరివారూ, చిలకమర్తివారూ, పానుగంటివారు నాకు ఆదర్శం.
ధన్యవాదాలు.
పై అన్నోన్ (ఫణీంద్ర పి, ఈటీవీ)!
తేలిగ్గా అర్థమవడానికి కొన్ని కొండ గుర్తులవి. ఇంగ్లీషులో, వాక్యం మొదటి అక్షరం "కేపిటల్" తోనూ, మధ్యలో వచ్చే నామవాచకాలకి మొదటి అక్షరం "కేపిటల్" తోనూ, "గాడ్" అని వ్రాయవలిసివస్తే యెప్పుడైనా, యెక్కడైనా "కేపిటల్" తోనూ....ఇలాగ చెప్పినట్టే. చాలామటుకు అవి నిజం కూడానూ.
పైన సుజాత గారికి ఇచ్చిన సమాధానం చదవండి.
ఈనాడు మీద ప్రేమ కాదు, అది "అనుబంధం"!
(మీ హ్హ! హ్హ! హ్హ! గురించి మీకిచ్చిన సమాధానం కొంచెం పెద్దది అవడంతో, వేరే టపాగా ప్రచురించాలని సంకల్పించాను. కొంచెం నిరీక్షించండి.)
మరో మాట--సుజాతగారికీ, మీకూ ఇచ్చిన సమాధానాలు నిన్న రాత్రే "ఆఫ్ లైన్లో" తయారు చేసుకొన్నవి. వాటిని ఇప్పుడు ప్రచురిస్తున్నాను. వ్యాఖ్యాతలు గమనించగలరు.
మీకు నా ధన్యవాదాలు.
డియర్ krishnaveni!
తెలుగులో వాడుకలో వున్న భేషజ/ఆడంబర పదం "ఆయన" కి సరైన పదం ఇంగ్లీషులో "లేదు" అనే నేను వ్రాస్తున్నది. "వాడు" అంటే యేకవచనమనీ, "ఆయన" అంటే "బహువచనం" అనీ అర్థం చేసుకొంటే యెలా?! పోనీ "వారు" అని బహువచనం యెక్కడైనా చదివారా?
మన సోకాల్డ్ తెలుగుపండితుల పద ప్రయోగాల గురించే కదా ఈ టపా? వాళ్లు "ఆయన" అనికాక ఇంకేమి వ్రాస్తారు?
పై వ్యాఖ్యాతలకిచ్చిన సమాధానాలు కూడా చదవండి.
ఇంకో చిన్న మాట--"ప్రశ్న" కి ఇచ్చేది సమాధానం. "పిలుపు" కి ఇచ్చేది జవాబు!
ధన్యవాదాలు.
డియర్ krishnaeni!
(అంతట్లోకే "క్రిష్ణేణి" అయిపోయావేమమ్మా?)
"హి" అనేది "గాడ్" ని రిఫర్ చెయ్యడం కోసం! అంతేకానీ, కేపిటల్ హెచ్ తో వ్రాస్తే, ఆయన అని అర్థమా?! కాదు కదా?
ఓ పెళ్లయిన అమ్మాయి, యెవరో అపరిచితుడినో, తెలిసున్న మగాడినో, గౌరవంగా "యేమండీ" అని పిలుస్తుంది.
తన భర్తని కూడా "యేమండీ" అని పిలవాలా? (ఆమె దృష్టిలో కాకపోయినా, సమాజం దృష్టిలో వారిద్దరి స్థానం ఒకటేనా?)
అందుకే ఆధునిక యువతులు తమ భర్తలని అతని పేరుతోనో, వాళ్ల కుటుంబ సభ్యులు చిన్నప్పణ్నించీ పిలుస్తున్న ముద్దు పేరుతోనో సంబోధిస్తున్నారు! (ప్రేమ యెక్కువయినప్పుడో, కోపం లోనో, "ఒరే" "యేరా" అనికూడా సంబోధిస్తున్నారనేది నా అనుభవంలోకి వచ్చిన విషయం.
"తెలుగు భాష"కీ, ఇలాంటివాటికీ యేమైనా సంబంధం వుందా?
ఇలాంటి చర్చల్నే నేను "ఆహ్వానించేది".
మీకు చాలా చాలా ధన్యవాదాలు.
కృష్ణశ్రీగారూ,
మొట్టమొదటిగా నేనే ఆ రెండు కృష్ణవేణులనీ. ఒకదాన్లో ఒక అక్షరం తప్పిందంతే.
ఇకపోతే మీరు చెప్పిన బహువచనం, ఏకవచనం గురించి ప్రస్థావిస్తూ మీరు బైబిల్ని ఉదహరించినప్పుడు (జీసస్ ఈస్ ది సన్ ఆఫ్ గాడ్. హి (వాడు/అతడు) తెలుగు బైబిల్లో యేసుక్రీస్తుని ఎప్పుడూ “ ఆయన” అనే సంబోంధించి ఉంటుందనే నేను చెప్పినది. ఎక్కడా వాడు/అతను అని కాదు. అంతే. నా వ్యాఖ్యకి మీ టపాలో ఉన్న ఇంకేదానితో సంబంధం లేదు.
ఇంతకీ మాస్టారూ... ఏక వచన గౌరవ వాచకాలకు ఏం వాడాలంటారు? లేక గౌరవ వాచకాలు కేవలం బానిస బుద్ధులు మాత్రమేనా?
డియర్ krishnaveni!
నా టపా "బాగా అర్థం చేసుకొన్నందుకు" మరోసారి నా ధన్యవాదాలు.
డియర్ phaneendra!
టపా చదివారు. మీరే చెప్పచ్చుగా!
ధన్యవాదాలు.
Post a Comment