Saturday, April 23, 2011

తెలుగు సినీ.....-3



......శంకరాభరణం

ఇంతాచేస్తే, రషెస్ చూస్తే,సినిమా అరగంటకూడా రాలేదు.

ముఖ్యమైన క్యారెక్టర్లు--శం. శం. శా., మం. భా., వాళ్లమ్మా, జమీందారూ, కొంతమంది కచేరీ నిర్వాహకులూ (జూనియర్ ఆర్టిస్టులు), శం. శా. కూతురూ (ఓ చిన్న పిల్ల--తరవాత రాజ్యలక్ష్మి అవుతుంది), అబ్బాయి (తులసి)--అంతే! 

మరి బాగా ఆడాలంటే, సగటు సినిమాకి అవసరమైన "క్యామెడీ" యేదీ? "రొమాన్సు" యేదీ? కళాఖండం అనిపించుకోవాలంటే, "సపోర్టు" యేదీ? (ఇంకోగంట సినిమా తియ్యొచ్చుకదా? ఇవన్నీ కూడా కలిపేస్తే పోలా!) అనుకొన్నాడు. 

అప్పుడొచ్చాడు--యెవరూ? ఆయన చిన్నప్పటి స్నేహితుడినంటూ అల్లు రామలింగయ్య. కొన్ని లింకులు కుదిరాయి--'తమిళ తంబిలకీ, కన్నడ సహోదరులకీ మాటిచ్చేశాను--కచేరీ జరిపించాల్సిందే, తరవాత నీ యిష్టం;' అంటూనూ, 'అమ్మయిని అన్నవరం పంపిస్తున్నావు. అంతే;' అంటూనూ, 'పెళ్లి చూపులకి వాళ్లొస్తారు, తరవాత నీ యిష్టం'--అంటూ. (అది క్యామెడీ). (అప్పటికి శం. శా. భార్యని కూడా చూపించినట్టు గుర్తు. ఆవిడ యెప్పుడు యెలా పోయిందో తెలీదు). 

మరి రొమాన్సెక్కడా? ఆయన కూతురు పెద్దదయి, రాజ్యలక్ష్మిగా అవతరించి, చంద్రమోహన్, నిర్మలా, చెంబుసీన్లూ, "సామజవరగమనా" పాటా! "ఆ వృషభం...." అంటూ మళ్లీ క్యామెడీ! చీల్చి చెండాడాడు ఆయన క్యారెక్టరు ప్రకారం సోమయాజులు. 

మరి "కళాఖండం" యెలా? ఆయన ఇంటి ముందు ఓ మేడపై కొందరు హిప్పీలూ, అర్థరాత్రి శోకాలూ, మళ్లీ ప్రొద్దున్నే తులసి వచ్చేటప్పటికి పాటలూ, దానికి వాడి డ్యాన్సూ, సోముగారు వాడిని చెంపదెబ్బ కొట్టడం, మళ్లీ అర్థరాత్రి వాళ్ల రూముకి వెళ్లి, "రా రా రి రీ.....రిబ రిబ రిబ (ఇంకో మూడు సార్లు), రా రా రా రి రి రీ రీ......ఓయ్! అని పాడేసి, ఓ చిన్న లెక్చరు దంచేసి, వచ్చెయ్యడం! 

తన కూతుర్ని మండుటెండలో గోదావరిలో పీకలోతువరకూ ములగబెట్టి, చలికి వణుకుతున్నట్టూ, తెల్లవారుఝామున అలాగే చలిలో సంగీత సాధన చెయ్యాలి అన్నట్టూ ఓ సీను! (ఇది సామజవరగమనా కి పునాది!) 

"సామజ..." తరవాత కూతుర్ని "శారదా..." అంటూ తిట్టెయ్యడం, మహాకవి కాళిదాసు లెవెల్లో, చంద్రమోహన్ "మాణిక్యవీణాం....." పాడడం, ఆయన వాణ్ణి అల్లుడుగా వొప్పుకొని పెళ్లికి అంగీకరించడం....కొసమెరుపు! (అదంతా క్యామెడినే! కాకుండా ఇంకా అనేక "రసాలు" కూడా చూశారు 'సగటు' విమర్శకులు!)

సరే. క్లైమాక్స్ ముందే తీసేశాడుకదా. దానికి తగ్గ డైలాగులు...."ఆ దాత యెవరో....శిరసువంచి...." వగైరాలు. వారసుడిగా తులసిని ప్రకటిస్తూ, తన గండపెండేరం వాడికి తొడిగి, తనువు చాలించడం, ఆయన పాదాలపై వ్రాలి, మం. భా. కూడా చనిపోవడం.....! శహభ్భాష్! 

ఇంకేం! కళాఖండమంటే ఇదీ!

.........తరువాయి ఇంకోసారి.

4 comments:

raviteja said...

ఇంతకీ మీరు ఆ కళా ఖండాన్ని తిట్టారా,పొగిడారా.

A K Sastry said...

డియర్ raviteja!

మరదే.....! "కాలింగ్ ఏ స్పేడ్ ఏ స్పేడ్" మాత్రమే అని ఈ విషయమ్మీద నా మొదటి టపాలోనే వ్రాశాను.

ఇంకా చదువుతూ వుండండి.

ధన్యవాదాలు.

కమనీయం said...

శంకరాభరణంసినిమాలొశంకరశాస్త్రి పాత్రలొ లొపాలను కూడా దర్శకుడు చూపించాడు.రొమాన్సు,హాస్యం కథలొ సున్నితంగా అతికినట్లెఉన్నాయి. చివరిలొ మంజుభర్గవి మరణం మాత్రం క్రుత్రిమంగా ఉన్నది.తులసిపాత్ర శం.శా.కి సంగీతంలొనే వారసుడుకాని భౌతికంగా కాదని నా అవగాహన.దర్శకుడు కూడా అలాగె చూపించాడనుకొంటాను. మొత్తం మీద గొప్ప కళా ఖండమే. సహేతుకంగాదేనిని ఐనా విమర్శించవచ్చును .కాని మీరు బయాస్తో విమర్శించారేమొ అనిపిస్తున్నది.===రమణారావు.ముద్దు

A K Sastry said...

డియర్ రమణీయం!

పెద్దవారు.....నా టపాలమీద దృష్టి సారించినందుకు ముందుగా కృతఙ్ఞతలు.

వివరంగా వ్రాసిన నా మూడు టపాల తరవాత కూడా, ముఖ్యంగా నేను ముందే చెప్పిన "కాలింగ్ ఏ స్పేడ్ ఏ స్పేడ్" అన్న తరవాత కూడా నాది "బయస్" అంటే ఇంకేమి చేయగలను!

నిజంగా అది కళా ఖండమనే వొప్పుకున్నారు అనేకమంది. అందుకే ఆయన కళా తపస్వి అయ్యాడు. ఇంకొన్ని కళా ఖండాలు తీశాడు!

నా తరువాత టపాలు కూడా చదివి, మీ విమర్శని అనుగ్రహించండి.

ధన్యవాదాలు.