సి నా రె
కవులమధ్య కూడా 'స్పర్థలూ', 'మనస్పర్థలూ' వుండేవి, వుంటాయి. (స్పర్థ అంటే పోటీ అని బాలసుబ్బు చెప్పాడు).
శ్రీ శ్రీ తన సిప్రాలి లో "సినారె! భళారె!" అన్నాడొకచోట.
సినారె గొప్పకవే. సినీసాహితీకారుడు కూడా. గొప్ప గొప్ప పాటలు వ్రాశాడు, 'హిట్' చేశాడు.
మొన్నీమధ్య, స్వాతి ముత్యం సినిమాలో తాను వ్రాసిన "సువ్వీ సువ్వీ....సువ్వాలమ్మా...." గురించి తన అమూల్య అనుభూతులని మనతో పంచుకున్నాడు. (నిజంగా అవి ఆయనే వ్రాశాడో, పత్రికలవాళ్లు నాలాంటివాడి చేత వ్రాయించి, ప్రచురిస్తున్నారో తెలియదు!)
ఆయన మాటల్లోనే.....ఈ గీతానికి ప్రేరణ తాను అంతకు ముందు జీవితచక్రం సినిమాలో వ్రాసిన "సువ్వీ సువ్వీ" అనే పాట. పల్లవి సిధ్ధమౌతుంటే, 'కళాతపస్వి' ఆ పాటలో హీరోయిన్ కీ, హీరోకీ, రామాయణానికీ లింకు పెట్టమంటే, "సీతాలమ్మా" అని వ్రాసెయ్యగానే, పల్లవి పూర్తయ్యిందట!
చెన్నై నుంచి హైదరాబాదో, హైదరాబాదు నుంచి చెన్నై ఫ్లైట్లో వెళుతూనో, ఓ సినిమాకి కావలసిన డజను పాటల్నీ అలవోకగా వ్రాసిపారేసే సినారె కి ఇదేమీ బ్రహ్మవిద్యేమీ కాదు కదా!
అంతవరకూ బాగానే వుంది. తరవాత, "అండా దండా వుండాలని, కోదండా రాముని నమ్ముకుంటే, గుండేలేని 'మనిషల్లే' నిను కొండా కోనల వదిలేశాడా?" తో వచ్చింది అసలు చిక్కు. దానికి ఆయన సమర్థన--రాముడు సీతని వదిలినట్టే, హీరోయిన్ వాళ్లాయన ఆవిణ్ణి వదిలేశాడు. హీరోయేమో, 'చూస్తున్నాడూ పైవాడు' అని రాబోయే కథని చెప్పేస్తాడు--ఇలా యేదో! అందులోనే అరణ్యవాసం వగైరాల ప్రస్థావన! (అసలు ఆ సినిమాలో హీరోయిన్ 'వృత్తి' యేమిటో యెవరైనా "ఠక్కున" చెప్పగలరా? అది కూడా ఆయన చెపితేనే నాకు తెలిసింది.)
అసలు "కోదండరాముడు" యెప్పుడయ్యాడు? రామరావణ యుధ్ధంలో కదా? సీతమ్మని వదిలేసింది, రావణవథ జరిగి, సీతను తెచ్చుకొని, పట్టాభిషేకం అయ్యి, తరవాతెప్పుడో వుత్తర రామచరిత్రలో కదా?
రాముడు 'మర్యాదాపురుషోత్తముడు' అనీ, దేవుడుకాదు, మనిషి కాబట్టే, అలా ప్రవర్తించాడనీ పండితులు చెపుతూంటారు. కానీ ఈయన (ఆయన దేవుడు అయినా, గుండేలేని) 'మనిషల్లే' ప్రవర్తించాడు అంటాడా?
అంత బాధెందుకు? ప్రాసకోసం పాట్లు పడ్డాను. యేదో వ్రాశాను, హిట్టయ్యింది! జనాలకి నచ్చింది! అంటే గొడవొదిలిపోనుకదా? ఈ సమర్థనలెందుకు?
పెద్దలు యేమి చేసినా చెల్లుతుంది మరి.
4 comments:
ఆ వ్యాసం చదవలేదు. కాని మీ మాటల్లో రంధ్రాన్వేషణ తప్ప పెద్దగా మరేం లేదు.
daemon tools, youtube to mp3
yahoo detector, youtube to mp3
web design, youtube to mp3
యేమిటో.....జల్లెడని జల్లెడ అంటే అది రంధ్రాన్వేషణా!
బాగుంది.
కోదండ రాముడినే... కోదండ రాముడనకూడదనడం,
గర్భవతిని వదిలేసినా.... మర్యాదరామన్న అనాలనడం..
ఏం జల్లించాలని? ఐనా.... ఆ పాటలో మీరేం విమర్శించాలనుకున్నది మరింత వివరిస్తే సంతోషం.
search engine optimisation, youtube to mp3
internet advertising, youtube to mp3
web advertising, youtube to mp3
నేనన్నది "అండా, దండా....." ఇలా "ండ" లు వ్రాసేసి, దాన్ని "అరణ్యవాసంలో" (గర్భవతిగా వదిలేసినప్పుడు కాదు!) ఆవిడ పడ్డ కష్టాలనీ, "చూస్తున్నాడా పైవాడు?" అంటే "చూస్తున్నాడు....." అని చెప్పి రాబోయే కథని (ఆవిడ కష్టాలు తీరి సంసారం చేసుకోవడం) సూచించానని చెప్పడాన్నే! (మొన్న ఈనాడు ఆదివారంలో "పాటకచేరి" లో ఆ వ్యాసం చదవండి.
నేనేమీ జల్లించాలనుకోలేదు....జల్లిస్తున్నది వారు, ఆస్వాదిస్తున్నది మీరు.
నిన్నా ఇవాళా వచ్చిన కవులు తమ పాటల్ని సమర్థించుకొంటూంటే, నవ్వు వస్తుంది. కానీ అంత సీనియర్ కవికి ఇవేం బాధలు? అని.
Post a Comment