ఇది చదివారా?
"వివాహ సంబంధములైన వేడుకలు విశేషముగా వర్ణింపదలచుకొనలేదు. అయినను, ముఖ్యమైన వొకటి రెండు గలవు. పప్పుభొట్లవారితో నన్నంభొట్లవారు వియ్యమందినప్పుడు వారి కుభయులకు ననాది బంధువులైన నేతివారు దయచేసి వారితో గలసి మెలసి వివాహమునకెంతో శోభదెచ్చిరి. నేతివారుగాక ముఖ్యముగ నన్నంభొట్ల వారికి బంధువులైన కందావారు, చెమ్మకాయలవారు, బీరకాయలవారు, చేమకూరవారు, వంకాయలవారు, మిరియాలవారు, దోసకాయలవారు దయచేసి, రేయింబవళ్లు తిరిగి, రెక్కలు ముక్కలగునట్లు పనిచేసి మెప్పువడసిరి. ఉప్పువారు మొదటినుండియు నచ్చటనేయుండిరి. కాని వారికన్నంభొట్లవారితో నంతయైకమత్యము లేదు. ఉప్పువారికిని మన పప్పువారికిని నతికినట్లన్నంభొట్లవారితో నతకదు. ఉప్పువారికిని బంధుమిత్రులకుగూడ నెక్కువ కలయిక యుండెను. గొల్లప్రోలు నుండి చల్లావారు మొదట నేకారణముచేతనో రాక కడపట విచ్చేసిరి. కడపట విచ్చేసిననను మొదటి నుండియు నన్నంభొట్లవారికాప్తులగుటచేత వారి సమాగమ మెంతో రసవంతముగ నుండెను"
6 comments:
:)
ఇది వ్రాసింది మీరేనా లేక వేరే పుస్తకం లోనిది ఇక్కడ మాకు ఇచ్చారా? రచన, రచయిత వివరం తెలపండి.
చిలకమర్తి వారి గణపతిలోది అనుకుంటా
ఏ వ్యాసం చిలకమర్తి వారిది అని గుర్తు. చిన్నప్పుడెప్పుడో చదివాను. పూర్తి వివరాలు తెలీవు కానీ అద్భుతమైన హాస్య రచన.
ఫణీంద్ర పి, ఈటీవీ2
డియర్ శరత్!
నాకంత సీనుందా!
నా సీను తరవాత టపాలో చూడండి.
ధన్యవాదాలు.
డియర్ కొత్తపాళీ!
చాలాకాలానికి......!
సరిగ్గా చెప్పారు.
ధన్యవాదాలు.
డియర్ phaneendra!
బాగానే గుర్తు చేసుకొన్నారు గానీ, అది వ్యాసం కాదు. గణపతి నవలలోది.
ధన్యవాదాలు.
Post a Comment