Friday, May 6, 2011

తెలుగు హాస్య సాహిత్యం-2



"గణపతి"

(ఇలా వ్రాసి, క్రింద "గణపతి" లోని ఆ భాగాన్ని ప్రచురిస్తే బాగుంటుందని ఇది తయారు చేశాను. కానీ, కొంచెం సస్పెన్స్ వుంటే బాగుంటుందేమో అనిపించి, ఆ భాగాన్ని ముందు ప్రచురించాను.) 

నేను నా జిన్నతనముననే వావిళ్లవారో నెవరో బ్రచురించిన జిలకమర్తివారి గణపతి ని జదివితిని. తరువాత, నా యున్నత విద్యా కాలమున మరల "ఎమెస్కో" (ఇది నామవాచకమైనందున బదము మొదటి యచ్చు దప్పదు!) వారో మరి యెవరో బ్రచురించిన గణపతిని మరలజదివితిని. అదే కాలములో నాకాశవాణి ద్వారా బ్రసారము కాబడిన నండూరి వారు గణపతిగా నటించిన (శ్రవణించిన) యా నాటకమో, నాటికనో--బలుసార్లు వింటిని. టేపురికార్డరను నొక సాధనము (అన్వేషణ యను జలన చిత్రమున జూపించినటువంటిది) నాదగ్గరుండుటచే, ఆ "రేడియో" నాటికను "రికార్డు"జేసుకొని, మరల మరల వినియానందించుచుంటిమి మా యింటిల్లపాదియును!

మొన్ననీమధ్యన "విశాలాంధ్ర" వారు "చంద్ర"యనునొక నార్టిస్ట్ వ్రాసిన (గణపతి తన బొగజుట్ట నుండి వెలువరించుచున్న బొగతో "గణపతి" యని వ్రాసినట్లు బ్రచురించిన ముఖజిత్రముతో) పునర్ముద్రించిన బుస్తకమునుగూడా గొంటిని. నా "యింటి గ్రంధాలయమున" బ్రస్తుతమా బుస్తకమున్నది.

నా దెలుగు బ్లాగ్మితృలకునోజిన్న గానుకనొసంగగోరి, నీక్రింది టపాను బ్రచురించుచున్నాను. 

(తెలుగు బ్లాగ్ మితృలూ, బ్లాగ్ పోలీసులూ, పైన వ్రాసిన వాక్యాల్లోని "అచ్చులనీ, హల్లులనీ", "పరుషాల"నీ, "సరళాల"నీ వాటి "స్థానాలనీ" గమనించగోర్తాను. అరసున్నాలుండవలసిన చోట అవి వ్రాయడానికోపిక లేక వదిలేశాను. దయచేసి అవి వున్నట్టే భావించవలసినదిగా ప్రార్థన.)

"గణపతి" ప్రథమ భాగము, నాల్గవ ప్రకరణము, నుండి (నేను జదివిన, విన్న, యంశములుమాత్రమే, యథాతథముగా) వ్రాయుచున్నాను....నా బ్లాగు సహోదరులవధరింప బ్రార్థన.

....తరువాయి మరియొకసారి.

3 comments:

కొత్త పాళీ said...

శైలి బాగానే పట్టుకున్నారు :)
అరసున్నలుకూడా ఒక బస్తాడు తెప్పిస్తే ఇహ మిమ్మల్నడే వారులేరు.

కొత్త పాళీ said...

అడ్డేవారు లేరు.

A K Sastry said...

డియర్ కొత్త పాళీ!

బాగానే పట్టుకున్నానన్నందుకు సంతోషం.

అరసున్నాలకి మాత్రం నాకు వోపిక లేదండీబాబూ!

ధన్యవాదాలు.