Saturday, September 25, 2010

తల్లులు

పాకీవాళ్లు


'పాకీపిల్ల 'వటంచు నిన్ను నిరసింపజూతురమ్మా స్వయం
పాకస్వాములు కొంతమంది, ఇది యే పాపంబో! మూన్నాళ్లలో
నే కన్నులు తలకెక్కి వెన్‌క గనరీ నిర్భాగ్య దామోదరుల్
పాకీదేగద మాకు మా జనని బాల్యమ్మందు సంజీవనీ!

వృత్తి ధర్మం గా పారిశుధ్య పని చేశేవాళ్లని 'పాకీ వాళ్లు ' అని ఈసడించుకుంటే, ప్రతీవాడి తల్లీ పాకీదే కదా? అని ప్రశ్నించాడు కవి "కరుణశ్రీ" జంధ్యాల పాపయ్య శాస్త్రి!

మా చిన్నప్పుడు స్కూల్లో, ప్రక్కవాడిని నువ్వు చిన్నప్పుడు పాకేవాడివా? దేకేవాడివా? అనడిగి, పాకేవాణ్ని అని వాడు సమాధానం చెప్పగానే--యేయ్! వీడు పాకీవాడట! అని వెక్కిరించేవాళ్లం!




6 comments:

మాలా కుమార్ said...

బాగా చెప్పారండి .

A K Sastry said...

డియర్ మాలా కుమార్!

నా సాహితీ బ్లాగ్ మీద మీ దృష్టి సారించినందుకు సంతోషం.

ధన్యవాదాలు.

Sujata M said...

I read this poem in Eenadu adivaram issue.

Incidentally I read 'The Untouchables' during the same period. I liked this poem, in a deeper sence.

A K Sastry said...

డియర్ Sujata!

నేను కూడా ఈనాడు ఆదివారం లో చూశాకే, అంత ప్రాచుర్యం కాని పద్యాన్ని నా 'సాహితీ' లో వ్రాశాను.

ధన్యవాదాలు.

కళ్ళే నరసింహం said...

చాలా అద్భుతమైన పద్యం! నేను పద్యరచన నేర్చుకోవడం మొదలుచేసినప్పుడు (2018 జూన్ లో) ఈ పద్యంలోని చివరి పాదంలో ప్రాసపైన 2018 అక్టోబరులో సందేహం కలిగింది. రెండునెలల వరకూ తీరలేదు. డిసెంబర్ లో అర్థమైంది.
🙏🙏🙏

A K Sastry said...

Thank you Sir.