ఆశు నిందఓ కవిగారు, ఒక కన్నే వుండే ఓ రాజుగారి దర్శనానికి వెళ్ళారట.
ఆ రాజు దర్శనమివ్వడానికే చాలా రోజులు తిప్పలుపడాల్సి వచ్చిందట! (ఈ లోగా ఆయనకో ప్రియురాలు—అంటే ‘చిన్నిల్లు’ కూడా వుందని తెలిసిందట.)
కొన్నాళ్ళ తరవాత ఆఖరికెప్పుడో దర్శనం లభించిందట.
గుర్రుగా వున్న మనసుతో, నిండు సభలో నిలబడి, ఈ క్రింది పద్యం ఆశువుగా చదివాడట…..
“అన్నాతినిగూడ హరుడవు
అన్నాతినిగూడకున్న అసురుల గురుడౌ
అన్నాతిరుమలరాయా
కన్నొకటి కలదుగాని కౌరవపతివే!”
(అర్థం అయినవాళ్ళు చాటుగా నవ్వుకున్నారట, లేని వాళ్ళు ‘ఆహా! యెంతబాగా పొగిడాడు!’ అనుకున్నారట!)
దీని భావమేమి పాఠకేశా?
No comments:
Post a Comment