Friday, August 14, 2009

తెలుగు సాహిత్యం

పేటికాంతర శవము.
పెరమల రామచౌదరీగారిచే రచియించబడిన

అత్యద్భుతాపరాధ పరిశోధక నవల.
ప్రస్తుతము మన ఆంధ్ర వాఙ్మయమునందుగల అపరాధక నవలలోనెల్ల నియ్యదియే మిన్నయని చెప్పకతప్పదు. ఇందుగల ప్రతివిషయమును అత్యద్భుతాశ్చర్యజనకమై నీతిబోధాత్మకమై, విరాజిల్లుచుండును. ఆనంద విషాదముల కునికిపట్టగు నీనవల చదువ మొదలుపెట్టినచో ముందేమిజరుగునో యను తహతహ వొడముచుండును. వేరొకచో జదువరుల గుండెలవిచ్చన్నముగా నుండవేమో యనునంత భయము పుట్టజేయును. ఇంకొక్కచోట నాహా! ఎంతయాశ్చర్యమని నొచ్చుకొనకపోరు. ఎట్టియద్భుతములు—యెంతలేసి చమత్కారములు—ఇందు—సత్ప్రవర్తనుడగు రమేశదత్తుపైబడిన నేరము—ఆయనను అరెస్టు చేయుట, ఇందిరానరేంద్రుల స్నేహవాత్సల్యము—రమాసుందరి విజయుల బద్ధానురాగము—పాపము!—నీలకంఠుని ఘోరమరణము—దివాకరజీగారి యపరాధపరిశోధనానైపుణ్యము—నరేంద్రవిజయుల గూఢచర్యలు—దాదుచెందుపై ననుమానము—అపరాధపరిశోధనయందుగల రమాసుందరి బుధ్ధికుశలత—మలయాకరజీ గారి మాయానటన (రక్షకభటోద్యోగము) ఎత్తుపైఎత్తులు, వింతలు పై వింతలు—ఘోరహత్యలు—యుక్తిప్రదర్శనములు—శక్తిసామర్ధ్యములు—కపటానురాగములు మాయవేషములు మోసములు చదివితీరవలెనేగాని వ్రాయనలవికావు. ఇంతయేల ఇట్టినవల ఇదివరకు మీరు చదివి యుండరనియే చెప్పవచ్చును. ఛక్కని కాగితములపై డెమ్మీసైజున 250 పేజీలు గలిగియుండును. మృదుమధురములగు పదములతో తేలిక శైలిలో నతిచక్కగా వ్రాయబడినది. వెంటనే పుస్తకములకు వ్రాయుడు. ఆలస్యమైనచోనాశాభంగమే.
వెల రు. 1—0—0.
శ్రీ బాలకృష్ణా బుక్ డిపో., బుక్సెల్లర్సు, రాజమండ్రి.

(ఇది 1929 వ సంవత్సరం పి.వి.రామయ్య అండ్ బ్రదర్సు, శ్రీ బాలకృష్ణా బుక్ డిపో, రాజమండ్రి వారు ప్రచురించిన ఓ పుస్తకం మొదటి లోపలి అట్ట పై ప్రచురించిన వాణిజ్య ప్రకటన! మరి 1929 లోనే తెలుగులో (బెంగాలీ ప్రభావం తోనే కావచ్చు) అపరాధ పరిశోధక నవల వెలిసిందన్నమాట! కానీ 1940 ల్లో శ్రీ కొవ్వలి లక్ష్మీనరసిం హారావు గారు వ్రాసిన (పేరు గుర్తు లేదు) నవలనే తెలుగులో తొలి అపరాధ పరిశోధక నవలగా గుర్తించారు! బహుశా మిగిలినవి అలభ్యాలు కాబట్టి యేమో!)

యెవరైనా ఈవిషయం లో యేమైనా చెప్పగలరా?


3 comments:

కొత్త పాళీ said...

పొరబాటు. 20లలోనే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారు అనేక అపరాధ పరిశోధన కథలూ నవలికలూ రాశారు. ఇంకా చాలా మందే రాసి ఉండొచ్చు.

A K Sastry said...

డియర్ కొత్తపాళీ!

యేది పొరపాటంటారు?

కొవ్వలివారి పేర వున్న రికార్డా?

నేనన్నదీ అదే కదా! మిగిలినవి అలభ్యాలు కావడం వల్లనే నేమో.....అని!

ధన్యవాదాలు!

కొత్త పాళీ said...

vokay. I misread your statement.