Saturday, July 11, 2009

ఆడ త్రాచుపాము.....



చ|| అనవిని వ్రేటువడ్డ యురగాంగనయుంబలె, నేయివోయ భ
గ్గన దరిగొన్న భీషణ హుతాశన కీలయనంగ లేచి హె
చ్చిన కనుదోయి కెంపు దన చెక్కుల కుంకుమ పత్రభంగ సం
జనిత నవీనకాంతి వెదజల్లగ గద్గద ఖిన్నకంఠియై!

ఈపద్యం మీద మీ కామెంట్ యేమిటి?


6 comments:

రానారె said...

ఎక్కడిదండీ ఈ పద్యం? ఎవరీ గద్గదఖిన్నకంఠి? ఆమెకంత రోషం తెప్పించిన ఆమాటలేవి? ఎవరివి?

కొత్త పాళీ said...

తొమ్మిదో తరగతి తెలుగు వాచకం, కోపన పాఠం

జ్యోతి said...

ఈ పద్యం స్కూలులో చదువుకున్నది.. పాఠం గుర్తులేదు

కామేశ్వరరావు said...

ఎంత అద్భుతమైన పద్యం! దీనికి ఆణిముత్యాల శీర్షికని ఇవ్వకపోవడాన్ని నేను ఖండిస్తున్నాను :-)
క్లుప్తంగా చెప్పాలంటే, ఇది ముక్కు తిమ్మన రచించిన పారిజాతాపహరణంలోది. ఈ కోపం సత్యభామది. నారదుడు తెచ్చిన పారిజాతపుష్పం కృష్ణుడు రుక్మిణికి ఇచ్చాడన్న వార్త విన్నప్పటి సన్నివేశం.

జ్యోతి said...

అవును సత్యభామ ఎంత కోపంగా ఉందో కదా..???

A K Sastry said...

డియర్ రావారె! కొత్తపాళీ! జ్యోతి!

మీ స్పందనకి ధన్యవాదాలు!

భైరవభట్లవారూ!

ఇది ఆణిముత్యం కాదనే దమ్మెవరికైనా వుందా! పద్యం వ్రాశాక యెందుకో 'ఆడ త్రాచుపామూ అనే శీర్షిక స్వతహాగా వచ్చేసింది--అంతే! సన్నివేశాన్ని వివరించినందుకు ధన్యవాదాలు!