Tuesday, June 16, 2009

ఆణి ముత్యాలు


చ| అటజనిగాంచె భూమిసురుడంబర చుంబి శిరస్సరర్ ఝరీ

పటల ముహుర్ముహుర్లుట ధభంగ,మృదంగ, తరం గ నిస్వన

స్ఫుట టనానుకూల పరిఫుల్ల కలాపి కలాపి జాలమున్

కటక చరత్కరేణు కరకంపిత సాలము శీతశైలమున్|

యెత్తైన చోటునించి క్రిందకి పడుతున్న నీళ్ళ 'సర్ సర్ ' మనే చప్పుళ్ళూ,

'ధభీ' మని పడడం, 'మృదంగ ' ధ్వని చెయ్యడం,

'స్ స్ ' అని శబ్దం చెయ్యడం, 'ట ట ' అని పడి,

మళ్ళీ 'ఫెళ్ళు ' మని యెగయడం, తరవాత 'గల గల ' అనే శబ్దం చెయ్యడం,

'తళుక్ తళుక్' అనిపించడం--ఇవన్నీ ఈ 'శబ్దాలంకారా శిరోభూషణం' లో వినిపించడం లేదూ!


8 comments:

A K Sastry said...

అయ్యా!

చూశారా....మన తెలుగు సాహిత్యానికున్న విలువ?

ఈ పద్యం మీద ఒక్క....ఒకే ఒఖ్ఖ కామెంట్ కూడా రాలేదంటే......!

పోనీ, అది యే కావ్యం లోనిది, యే సందర్భం లోనిది, యెవరు వ్రాసారు, అందులోని ఔచిత్యం యేమిటి....ఇలాంటి వాటి మీదైనా యెవరైనా వ్రాస్తారా?

....వృధాయేనా?

చదువరి said...

http://telugupadyam.blogspot.com/2008/05/blog-post_25.html

Unknown said...

@కృష్ణశ్రీ గారు,
వేమన పద్యలైనా మరచిపోవచ్చు గాక, ఇంత అద్భుతమైన పద్యాన్ని తెలుగు అభిమానులెవరూ మరచిపోరు. వ్యాఖ్యానించక పోయినంత మాత్రాన మరచినట్టు కాదు సుమా..

కామేశ్వరరావు said...

నాకు మొహమాటం కాస్త జాస్తి. అంచేత నా పోస్టుకి నేను లంకె ఇవ్వలేక ఊరుకున్నాను. చదువరిగారూ, మీరా పని చేసినందుకు నెనరులు.
కృష్ణశ్రీగారు, మీరిలాగే మరిన్ని ఆణిముత్యాలని పరిచయం చెయ్యండి. ఆసక్తిగా చదివేవాళ్ళు కొందరైనా ఉన్నారు (అందులో నేనొకణ్ణి). కాబట్టి వ్యాఖ్యలు రాలేదని సందేహించకండి.

Bolloju Baba said...

భైరవభట్లగారి మాట నిజం. మీరు వ్రాయండి. చదివే వారు ఉన్నారు.

A K Sastry said...

డియర్ చదువరీ! మిరియాల శ్రీ సత్య భ్రమరార్జున ఫణి ప్రదీప్!

నా బ్లాగింగు మొదలుపెట్టినప్పటి నించీ, మీ కామెంట్ ల వల్ల నాకు అనేక ఆణి ముత్యాల్లాంటి 'లింకులూ', 'బ్లాగులూ', 'మిత్రులూ' ఇంకా చాలా లభిస్తున్నాయి! లాభిస్తున్నాను! అన్నిటినీ 'బుక్ మార్క్స్ ' గా, 'ఫేవరిట్స్ ' గా పెట్టుకొని, కొంచెం సమయం దొరికినా, వాటిని ఆనందిస్తున్నాను!

నిజం గా ఇది నా 'పురాకృత సుకృతం'

ఇక నా టపా మీద నేనే వ్రాసుకొన్న కామెంట్ 'ఉతూతి!' సరదాగా రెచ్చగొట్టడానికే! దయచేసి కష్టపెట్టుకోవద్దు!

ధన్యవాదాలు!

A K Sastry said...

డియర్ భైరవభట్ల కామేశ్వర రావు!

నా టపా మీద నేనే కామెంట్ వ్రాసుకున్నప్పుడు, దానికి కూడా జవాబులు రాకపోతే, ఆ పద్యాన్ని వివరించాలేమో అని మధన పడ్డాను!

1964 లో నేను యెనిమిదో క్లాసు (థర్డ్ ఫారం) చదువుతున్నప్పుడు, ఎస్ ఎస్ ఎల్ సీ చదువుతున్న మా అన్నయ్య తెలుగు వాచకం లో 'కంఠస్థ ' పద్యాల్లో అదొకటి! వాడి తోపాటు దాన్ని కంఠస్థం చెయ్యడమే కాదు, దాని అర్థ, సౌందర్యాలని తరవాత్తరవాత మధించి, నా మదిలో దాచుకున్నాను! (నేను ఆ క్లాసు కి వచ్చేటప్పటికి ఆ వాచకం మారిపోయింది! నేను వేరొకటి--యెప్పుడూ వినని, చదవని పద్యాలతో--చదవాలిసొచ్చింది!)

నేను అనుకున్న దాని కన్నా, చాలా చక్కగా, కొంత కాలం క్రితమే మీరు 'నెటిజన్ ' లకి వివరించారంటే, మీకు నా జేజేలు!

మీ పరిచయం, మీ వ్యాఖ్య అందుకోవడం నిజంగా నా 'పురాకృత సుకృతం'

ధన్యవాదాలు!

A K Sastry said...

డియర్ బొల్లొజు బాబా!

చదువరీ, మిరియాల లకి నేను జవాబుని ప్రచురించాక, మీ వ్యాఖ్య ప్రచురించబడింది! లేకపోతే, మీ పేరు కూడా ఆ జవాబులోనే కలిపేవాణ్ణి!

మీ వ్యాఖ్యతో నాకు వెయ్యేనుగుల బలం వచ్చింది! కొండల్లాంటి మీవంటివారు అండగా వుండగా, తెలుగు సాహిత్యానికేమి! పదికాలాలు కాదు వెయ్యి కాలాలు వెలిగి పోతుంది! (పోదు--వెలుగుతూనే వుంటుంది!)

ధన్యవాదాలు!