ఈ ఆణిముత్యాన్ని అస్వాదించండి!
చ| అలఘు ఫణీంద్ర లోక కుహరాంతర దీప్త మణిస్ఫురత్ప్రభా
వళి గలదాని శశ్వదుదవాస మహావ్రత శీతపీడితా
చల మునిసౌఖ్య హేతు విలసద్బడబాగ్ని శిఖాచయంబులన్
వెలిగెడిదాని గాంచిరరవింద నిభాననలమ్మహోదధిన్|
మరి మీ వ్యాఖ్యలు?
"నాకు నచ్చిన సాహిత్యం, పదిమందికీ తెలిస్తే బాగుంటుందనుకున్నవీ"
4 comments:
"గాంచిరరవింద నిభాననలమ్మహోదధిన్" అన్న చివరి పాదం, పద్యమెక్కడిదో పట్టిచ్చేసింది! దీని తర్వాతి పద్యం దీనికన్నా ప్రసిద్ధం.
వివిధోత్తుంగ తరంగ ఘట్టిత చలద్వేలావనైలావలీ
లవలీ లుంగ లవంగ సంగత లతా లాస్యంబు లీక్షించుచున్
ధవళాక్షుల్ సని కాంచి రంత నెదురం దత్తీర దేశంబునన్
దవదాతాంబుజ ఫేనపుంజ నిభు నయ్యశ్వోత్తమున్ దవ్వులన్
మొదటి పద్యంలో చూసింది సముద్రం, రెండో పద్యంలో చూసినది గుఱ్ఱం. చూసినవారు కద్రూ వినతలు.
నన్నయ్య అక్షరరమ్యతకి ఈ పద్యాలు ఉదాహరణలుగా చెప్తారు.
డియర్ కామేశ్వర రావు గారూ!
మాకు ఎస్ ఎస్ ఎల్ సీ లో ఈ రెండూ కంఠస్థ పద్యాలే అయినా, అతి కష్టం మీద ఇదొక్కటే ఙ్ఞాపకం వచ్చింది!
మరి వీటిగురించి మీ బ్లాగులో వివరించడానికి మీ అమూల్య సమయం కొంత కేటాయించరూ!
ధన్యవాదాలు!
వీలుచూసుకొని ఆ ప్రయత్నం తప్పకుండా చేస్తానండీ.
చాలా సంతోషం శ్రీ కామేశ్వర రావూ!
Post a Comment