Tuesday, June 2, 2009

స్వభార్యా సౌందర్యం

పెద్దిభొట్టుగారు ఓ ప్రఖ్యాత కవి! మంచి మంచి కవితలూ, ఖండికలూ గట్రా వ్రాశేవాడు.

ఒక రోజు, మామూలుగా ఆయన కవితా వ్యవసాయం ప్రారంభించబోతూం డగా, పాపం ఆయన భార్య, ‘యేమండీ, మీ కవితల్లో అనేకమంది నాయికల్నీ, వివిధ అందాల్నీ, వర్ణిస్తారు కదా? దయ చేసి, నా మీద ఒక పద్యం వ్రాయరూ?’ అని బెల్లించింది!

వెంటనే అందుకున్నారు మన పెద్దిభొట్టు గారు:

‘మేరు మంధర సమాన మధ్యమా!
తింత్రిణీదళ విశాల నేత్రీ!
అర్క శుష్కఫల కోమల స్థనీ!
పెద్దభొట్ట గృహిణీ విరాజతే!’

అని!

ఆవిడ పాపం, ‘అబ్బో! మేరువులూ, మంధరాలూ, తింత్రిణీ దళాలూ, అర్క ఫలాలూ—అబ్బో! భలేగా వర్ణించారులెండి!’ అని ఆనందించిందిట!

దీని భావమేమి అంటే—మేరు మంధర పర్వతాలతో సమానమైన నడుము తో, చింతాకులంత విశాలమైన కళ్ళతో, యెండిన జిల్లేడు కాయలవంటి స్థనాలతో, పెద్దిభొట్ట గృహిణి విరాజిల్లుతోంది—అని!

చూశారా! యే మొగుడుకైనా తన పెళ్ళాం యెంత అందంగా కనిపిస్తుందో!

అదే పక్కింటివాడి పెళ్ళాం అయితేనా?

అది మరోసారి!

4 comments:

కాలనేమి said...

ROFL!!

శరత్ కాలమ్ said...

:)

A K Sastry said...

డియర్ యోగి!

'రియల్లీ ఒన్ ఫూలిష్ లేఖ ' అని కాదు కదా?!

ధన్యవాదాలు!

A K Sastry said...

డియర్ శరత్ 'కాలం '!

మీ సంతోషమే నా సంతోషం!

ధన్యవాదాలు!