బుచ్చి
బాబు కథలు--
ఆ
ఉ ఓ లు
“............ఆ
ఊళ్లో రోడ్డు ప్రక్కన చాప
మీద పరచిన పాత పుస్తకాల
వ్యాపారసంస్థను చూసి ఆశ్చర్య
పడ్డాను.........
పుస్తకాలు
ఈతాకుల చాపమీద పరిచి వున్నాయి.
మధ్యన ఒక
గల్లాపెట్టెలాంటిది వుంది.
గజం దూరం లో
ఎలక్త్రిక్ దీప స్తంభం,
మడిచేసిన ఒక
గొడుగు, మిగతావి
పాత పుస్తకాలు. అవన్నీ
నిజంగా పాత పుస్తకాలే.
పాతవే కాదు,
ప్రాచీనమైనవి
కూడా. అన్నీ
తెనుగు గ్రంథాలే.
కొన్నింటికి
అట్టలే లేవు, పమిటకొంగులేని
చీరలా; కొన్నింటికి
మధ్యకుట్టిన కంతలు తప్ప దారం
లేదు. కొన్ని
తుదిమొదళ్లు లేని, పుస్తక
కళేబరాలు. కొన్నింటి
పుటలు, కదిపితే్
పొడుం గా విడిబోతున్నాయి.
కొన్నింటిలో
అచ్చు కనిపించడం లేదు.
మరికొన్ని
లెదర్ బైండింగ్ లో వున్నా-యమధర్మరాజు
చర్మం లా వాటి లోపల పుటల్లో
సాలీళ్లు, బొద్దింకలు,
నెమలీకలు,
ఈగలు,
దోమలు వీటి
కళేబరాలు, పురావస్తు
పరిశోధకుడికి పిచ్చెత్తించేవిగా
వున్నాయి. ఎండకి
ఎండి, వానకి
తడిసి, కొనవూపిరితో
పడి వున్నాయి చాలా పుస్తకాలు.
అక్కడవున్న
కొన్నిపుస్తకాల పేర్లు--'ముకుంద
విలాసము', కస్తూరి
రంగకవి 'సాంబ
నిఘంటువు', బహుజనపల్లి
సీతారామాచార్యులుగారి 'ప్రసన్న
పారిజాతము', 'అలఘు
కౌముది' అందమైన
పేరు. మంత్రిప్రగడ
భుజంగరావుగారి 'ఉత్తరరామ
చరిత్ర', ఆ
పెద్ద పుస్తకం క్రింద
కన్నుమీటుతున్నది దాసు శ్రీరామ
పండితులవారి 'తెలుగునాడు'
అన్న కావ్యం.
పుటలు తిప్పి
చూశాను. బ్రాహ్మణశాఖలు
మాట్లాడే వ్యవహారికాన్ని
అనుకరిస్తూ 'అవ్షే',
'సూస్సివషే',
'బలే చౌడషే',
'కాదషే'
లాంటి
ఉదాహరణలున్నట్లు ఇప్పటికీ
ఙ్ఞాపకమే.
ఆంగ్లకవి
విలియమ్ కూపర్ రచించిన జాన్
గిల్పిన్ అను హాస్య కావ్యానికి
'దుర్మార్గ
చరిత్రము' అన్న
తెలుగు అనుసరణ నన్నాకర్షించిన
మరో పుస్తకం. దౌల్తాబాదు
హనుమాయమ్మగారి 'మన్వంతరము',
గంగతపల్లె
శంకరరావు గారి 'భారత
సారము' అను
గద్యము, గాడిచర్ల
హరిసర్వోత్తమ రావుగారు
అబ్రహమ్ లింకన్ గూర్చి
వ్రాసిన 'విస్మృత
రాజకవి' అను
గ్రంథం. 'వైశాఖ'
పత్రికలు--బైండు
చేసిన సంపుటాలు, అవటపల్లి
నారాయణరావుగారి 'విశాలాంధ్రము'
సీరము సుభద్రమ్మగారి
నవల 'జాగిలం'
ఇంకా 'త్రిపురాంతక
శతకం', 'కాశీమజిలీలు'
మూడవ భాగం.
నాకు ఙ్ఞాపకం
ఉన్నంతవరకూ ఇలాంటివి అక్కడున్న
పాతపుస్తకాలు. అవన్నీ
యాభై అరవై ఏండ్లనాటి పుస్తకాలు.
వాటినిగురించి
నాకేమీ తెలియదు. వాటిల్లో
దేన్నీ నా జీవితం లో చదవను.
కాని అవి
ఉన్నాయని తెలుసుకుని వాటి
వెనకవున్న తెలుగు సాహితీ
సంప్రదాయాన్ని తల్చుకుని
ఆనాటి రచయితల్ని అభినందించకుండా
ఉండలేను. ఎన్నో
చెత్తపుస్తకాలు వస్తేనేగాని,
ఒక మంచి పుస్తకం
రాదంటారు. సమకాలిక
గ్రంథాల విలువల పరిశీలనకి
అవి గీటురాయి. కాని
వాటిని చెత్తపుస్తకాలు
అనడానికి కూడా నాకు అర్హత
లేదేమో.ఆ
పుస్తకాలలో వస్తువుమీద,
అవి వ్రాసిన
వారిమీదా మనస్సు పోవనారంభించింది.
ప్రస్తుతాన్నుండి,
వెనకటి రోజులకు
పారిపోవాలనిపిచింది.
నాకా ఊళ్లో
కర్మాగారాలు, విద్యుత్
దీపాలు, మరలు,
లారీలు,
సిమెంట్
కట్టడాలు నచ్చలేదు.
బాల్యం లో నే
ఎరుగున్న చెరువులో తామరాకులు,
కాలవలో గేదెలని
కడుగుతూ గేదెపై స్వారీచేస్తూ
పాడుకుంటున్న పశువులకాపరీ
శ్రీరామనవమినాడు పందిట్లో
హరికథలూ, మర్రిచెట్టుక్రింద
పల్చటి చందమామ ఆకులమధ్య
కనబడుతూ, ఇలాయిబుడ్ల
వెలుగులో ప్రాణాలుతోడే వూపుతో
సాగే గొల్లసుద్దులూ,
చల్లటి పూరిపాకలు,
తరవాణి కుండలూ,
చెట్లనీడలో
పొడుం పీలుస్తూ పెద్దల
చదరంగపుటెత్తులూ నాకవే ఇష్టం.
ఆ జీవితం ఆ
పుస్తకాల్లో ఉంది . పాత
పత్రికల సంపుటాల్లో గోదావరి
మీద వంతెన వేయడం, మొదటి
రైలు వెళ్లడం వార్త చూశాను.
గతానికీ నాకు
లంకె ఆనాటిపుస్తకాలు,
పత్రికలు................”
ఇది
బుచ్చిబాబు కథ లోని "ఆ
ఉ ఓ లు" కథ
లోని కొంత భాగం.
ఎందుకు
వ్రాశానంటే, కొంతమంది
ఈ మధ్య, తమ
చిన్నప్పటి ఙ్ఞాపకాలూ,
ఆటలూ ప్రచురించి
మురిసిపోతున్నారు.
బాగానే ఉంది.
ఇంకొంతమంది,
ఫలానా కవి/రచయిత
అంటూ, వారి
జయంతులకీ, వర్థంతులకీ
పోస్టులు పెడుతూ, వాళ్లు
ఫలానా ఫలానా కావ్యాలూ,
నవలలూ,
శతకాలూ వగైరాలు
పుంఖానుపుంఖాలుగా వ్రాశారు
అని ఉట్టంకిస్తూ ఆనంద పడుతుంటారు.
నేనన్నది--అలా
లిస్టు వ్రాయడం కాదు--ఆ
పుస్తకాలలో, కనీసం
ఒకటి రెండు ఐనా సంపాదించండి.
ఇతరులకి
అందించండి అని.
అలా
చేస్తే, బుచ్చిబాబు
పాత పుస్తకాల దుకాణం లో
చూసినట్టు వ్రాసిన పుస్తకాలన్నీ
ఇప్పుడు లభ్యం అయి ఉండేవి
కదా? (కాశీమజిలీ
కథలు ఇప్పుడు లభ్యం అవుతున్నాయి.
సంతోషం.)
మిత్రుడు
పి టి ఎస్ కె రాజన్ తన బ్లాగులో
ఉదహరించిన పుస్తకాలన్నీ
దాదాపు లభ్యం అవుతున్నాయి.
కానీ,
నన్నయ దగ్గర
నుంచీ, పోతన
దగ్గర నుంచీ--నేటి
గరికిపాటి వారు, కడిమిళ్ల
వారి వరకూ--ఫలానా
ఇన్ని పుస్తకాలు వ్రాశారు
అని చెప్పుకోవడమే గానీ,
వాటిలో ఎన్ని
లభ్యం అవుతున్నాయి?
ఇప్పటికైనా
ఎవరైనా పూనుకుంటే,
భావితరాలకి
కొన్నైనా అందించగలం!
ఆలోచించండి!
1 comment:
బ్లాగులోకానికి తిరిగి స్వాగతం, శాస్త్రి గారూ ఫేస్ బుక్ వల లోంచి బైట పడ్డారా అయితే ? గుడ్.
మీ “రాడికల్” బ్లాగులో కూడా వ్రాయడం మళ్లీ మొదలెట్టండి
Post a Comment