‘వేటూరి…..
….సుందర రామ్మూర్తి'…..ఇకలేరు!
గొప్ప కవి ఆయన—యెందుకంటే—అర్థం లేని అలతి అలతి పదాలతో, గొప్ప గొప్ప సినిమా పాటలు వ్రాసేశాడు.
గొప్ప కవిత్వం వ్రాశాడు ఆయన—కానీ దాన్ని ఖూనీ చేసి, ఆయన వ్రాసిన సినిమాకికాకుండా వేరే సినిమాలో చిత్రీకరించి, ఆయన వ్రాసిన సన్నివేశానికి కాకుండా, వేరే సన్నివేశం లో చిత్రీకరించి, ఆయన వ్రాసిన వరుస(క్రమం)లో కాకుండా వేరే క్రమం లో చరణాలని మార్చేసి చిత్రీకరించి—కళాఖండాలు నిర్మించారు కళా తపస్వులు!
ప్రముఖ ‘కథ, స్క్రీన్ప్లే, మాటలు, పాటలు, దర్శకత్వం (అన్నీ)’ చేసేవాళ్ళకి ‘ఘోస్ట్’ గా వ్రాసిన పాటల దగ్గర నించీ, ఆయన మంచిపాటలే వ్రాశాడు.
కాని నాకుమాత్రం, మొహమాటం లేకుండా చెపుతున్నా—వ్రేళ్ళ మీద లెఖ్ఖ పెట్ట దగినన్ని పాటలే నచ్చాయి! (సినిమాలలో వచ్చినవి!)
‘దివిజ కవివరు గుండియల్ దిగ్గురనగ…..’ ఆయన వెళ్ళాడనీ, అక్కడైనా చక్కని కవిత్వం వ్రాసుకుంటాడనీ, ఆశిస్తాను.
6 comments:
నేను కూడ మొహమాటం లేకుండ వ్యాక్యానిస్తున్నా..! మీలాంటి గొప్ప సాహతీ మేధావుల దృష్టిలో వేటూరి వారు గొప్ప కవి కాకపోవచ్చు గాని, మాలాంటి పామరులకు మాత్రం చాలా చాలా గొప్ప మధురకవి నె వేటూరి వారు.
డియర్ కమల్!
ఆయన గొప్పకవి కాదని నేనెప్పుడన్నాను?
మీరంత పామరులు కాదని తెలుస్తూనే వుందిగాని,ఆయన మధుర కవే!
నా టపా మరోసారి చదివి, విమర్శ యెవరిమీదో అలోచించండి!
ఇంకా వివరణ కావాలంటే, మళ్ళీ వ్రాయండి.
ధన్యవాదాలు.
నేను మీతో ఏకీభవిస్తున్నాను. వేటూరి గారి మాటలు వింటున్నప్పుడు సినిమా పాటలు ఆయన పాండిత్యాన్ని పావు వంతు మాత్రమే చూపించాయని అనిపిస్తుంది. మామూలు గా మాట్లాడు కునే తెలుగు కే దిక్కులేక పోతున్న ఈ రోజుల్లో ఆయన లాంటి భాషా పటిమ వున్నా వాళ్ళు మళ్ళీ పుడతారని ఆశించడం దురాశే!
డియర్ sarvani!
చాలా సంతోషం!
పావు వంతు కూడా యెక్కువే నా దృష్టిలో!
ధన్యవాదాలు.
......కళాఖండాలు నిర్మించారు కళా తపస్వులు!
మా లాంటి వాళ్ళకు పూర్తిగా గుట్టు రట్టయ్యేలా వివరిస్తే సంతోషం.
విశ్వనాథునిపై అనుమానపడేలా రాశారు. నివృత్తి బాధ్యతా మీదే.
ఏమీ అనుకోనంటేనే, ఓ విన్నపం. ఏం రాసినా, చదివిన వాడికి ....వొలిచి పెట్టినట్లుగా, బుర్రలో మరే అనుమానప్పురుగూ తొలవడం మొదలు పెట్టకుండా రాయాలని మనవి.
website promotion, youtube to mp3, limewire
website optimization, youtube to mp3, limewire
భలేవారే! ఇందులో గుట్టూ, రట్టూ యేమీ లేవు.
శివ శివా! విశ్వనాథుణ్ణి అనుమానించడమే!
మనలో మన మాట, అలా వొలిచిపెడితే, ఇన్నాళ్లకి మీరీ వ్యాఖ్య వ్రాసేవారేనా?
(అంతా చదివి, 'బోరు' అనేవారేమో అని నా అనుమానం. అంతే.)
సరే. మీరడిగారుకాబట్టి ఓ టపా వ్రాస్తాను. చదివి చెప్పండి మరి.
ధన్యవాదాలు.
Post a Comment