ఆణిముత్యాలు
"కళవళమొంది తెలిపితివొ, కాక పరాకున తప్పవింటివో! కలనైనన్ రఘూద్వహుడు కానలలోనను త్రోయబంచునే?"
ఈ పద్య పాదం కంకంటి పాపరాజు వ్రాసిన 'ఉత్తర రామ చరిత్ర' లోది.
పాపరాజు చక్కటి తెలుగులో ఖండకావ్యాలూ, కావ్యాలూ వ్రాశారు.
సన్నివేశం--లక్ష్మణుడు, సీతని గర్భవతిగా వున్నప్పుడు, రాముడు ఆవిడ కోరిక ప్రకారం వనసీమలలో విహారానికి తీసుకెళ్ళమన్నాడు అని చెప్పి, అక్కడికి చేరాక, చావుకబురు చల్లగా చెప్పాడు--అక్కడ వదిలేసి రమ్మన్నాడని.
అప్పుడు ఒక్కసారిగా షాక్ తిన్న సీత, ఆ షాక్ లక్షణాలని లక్ష్మణుడికి ఆపాదిస్తూ, 'నువ్వే కలవరపాటు తో ఇలా చెపుతున్నావో? లేక ఆయన చెప్పిన మాటలు పరాగ్గా వుండి యేమి విన్నావో! కలలోనైనా, రాముడు నన్ను అడవుల్లో త్రోయమని పంపిస్తాడా!' అని ప్రశ్నిస్తుంది సీత.
ఆవిడకెంత నమ్మకమో రాముడి మీద--పిచ్చి తల్లి!
పద్యం పూర్తిగా గుర్తుకి రాలేదు--యెవరూ పూరించలేదు!
సరే.
"రంతుల్ మానుము కుక్కుటాధమ......ఉలూఖల.....తండులముల్...."
యెవరైనా పూరించగలరా?
2 comments:
రంతుల్ మానుము కుక్కుటాధమ ! దరిద్ర క్షుధ్ర శూద్రాంగణా
ప్రాంతోలూఖల మూల తండుల కణగ్రాసంబు చే క్రొవ్వి దు
ర్ధాంతాభీల విశేష భీషణ ఫణాంతర్మాస సంతోషిత
స్వాంతుండైన ఖగేంద్రు కట్టెదుర నీ జంజాటముల్ సాగునే !
ఈ పద్యం అల్లసాని పెద్దన చెప్పిన చాటువుగా పండితులు చెబుతూ ఉంటారు.
డియర్ జోగారావుగారు!
ఇన్నాళ్ళకి, పూరణ లభించినందుకు చాలా సంతోషం!
మీలాంటివారి దృష్టి నా బ్లాగ్ మీద పడడం ఓ అదృష్టం గా భావిస్తాను.
ఇది మేము చదువుకున్నప్పుడు యేదోపాఠ్య భాగం లో, కవి గురించి కూడా చదివిన గుర్తు. బహుశా అల్లసాని పెద్దన కాకపోవచ్చు.
నాకు గుర్తున్నంతవరకు, మాటలు సరిగ్గానే వ్రాశాను కదా అని ఇంకా సంతోషం గా వుంది.
ఇలాంటి విషయాలు తరచూ వ్రాస్తూ వుండండి!
ధన్యవాదాలు.
Post a Comment