Tuesday, April 13, 2010

పద్య సాహిత్యం

ఆణిముత్యాలు

'గండరగండడై యలవు గండను మెండుగ తాండవింప.......' అనే పద్య పాదం "పలనాటి వీర చరిత్ర" అనే పద్య కావ్యం లోనిది. యుధ్ధం లో బాల చంద్రుడి పరాక్రమాన్ని వర్ణించేది.

వ్రాసిన వారు కవి కోకిల దువ్వూరి రామి రెడ్డి గారనుకుంటా.

ఆయన 'పాంథశాల' కి వచ్చినంత ఫేం మిగిలిన కావ్యాలకి వచ్చినట్టులేదు.

పద్యం యెవరైనా పూర్తిగా ప్రచురిస్తే, సంతోషిస్తాను.


ఇంకో పద్య పాదం......

"కళవళమొంది తెలిపితివొ, కాక పరాకున తప్ప వింటివో, కలనైనన్

రఘూద్వహుడు కానలలో నను త్రోయబంచునే?"

ఈ పద్యాన్ని పూరిస్తారా యెవరైనా?

2 comments:

Ekalavya said...

మీరు నిజం గా మాకో పెద్ద పజిల్.

ఎక్కడెక్కడివో పట్టుకొచ్చి, ప్రశ్నలు వేస్తారు.

ఇప్పటి వాళ్ళకి మా చిన్నప్పుడు చదువుకున్న 'మేరీ హేడ్ ఎ లిటిల్ లాంబ్' లూ, 'హికరీ డికరీ డక్' లే తెలీదు.

మాకు ఇవన్నీ నూరిపొయ్యాలన్న మీ తపనకి జోహారు.

A K Sastry said...

డియర్ Ekalavya!

నూరిపొయ్యాలని కాదు....కనీసం పరిచయం చేస్తే, యెప్పటికైనా అవి దొరకబుచ్చుకొని చదువుతారేమో అని ఆశ!

రైమ్‌స్ కొత్త కొత్తవి వస్తున్నా, పుస్తకాల్లో పాతవి కూడా దొరుకుతున్నాయి.

మన సాహిత్యానికి మాత్రం అలాంటి ప్రయత్నాలు జరగడం లేదు.

అందుకే ఇలా!

ధన్యవాదాలు.