Sunday, April 4, 2010

అవధానాలు

సంగీతావధానం

శ్రీ సాయి కృష్ణ యాచేంద్ర సంగీతావధాని. 

ఈ అవధానం లో అష్టావధానం లాగానే పృచ్చకులు దత్తపది, సమస్య లాంటి ప్రశ్నలు వేస్తే, వాటిని చందోబధ్ధం గా పూరిస్తూ, ఓ రాగం లో బాణీ కట్టి, ఆలపించాలి.

ఇందులో యాచేంద్రని మించినవారు లేరు. ఇంకెవరైనా అభ్యసిస్తున్నారో లేదో తెలియదు.

శ్రీ యాచేంద్రకి ఓ సారి దత్తపది లో 'కోకో' 'వాలిబాల్' 'కబాడి' 'క్రికెట్టు' అనే ఆటల పేర్లతో దత్తపది ఇచ్చి, భక్తి భావం తో పూరించమన్నారు.

ఆయన పాడిన తీరు గుర్తుంది గానీ సాహిత్యం పూర్తిగా గుర్తు లేదు. సమస్యని ఆయన సాధించిన విధం మాత్రం హృదయానికీ మనసుకీ హత్తుకొని వుండి పోయింది.

అది.......

"యెందుకో కోదండరాముని......."

"....తల్లి వొడిలో వాలి బాలునివలె........"

"......గీతిక బాడి........."

"చక్రికెట్టుల..............."

ఇలాగ!

ఇది వొక ప్రశంసనీయ ప్రక్రియే. ఇంకెవరైనా తర్ఫీదు చెందితే బాగుండును.

2 comments:

ఊకదంపుడు said...

నాకు చాలా చాలా ఇష్టైమనది:
పొద్దు పోయిరాకురా ముద్దలకృష్ణా .. అని మొదలయ్యె కల్యాణి రాగం త్రిశ్రగతి లో చేయబడ్డ వీరి ఆశు సాహిత్యం. నెల్లూరి లో వీరి అవధానం లో జానకి గారో సుశీల గారో అడిగారుట. నే బాలు గారి కార్యక్రమంలో విన్నాను,దురదృష్టవశాత్తు సాహిత్యం వ్రాసుకోలేకపోయాను
ఇటలీలలు సాగించీ...
మంచైనా....
నిత్యజపానుశీలనురా...
ఏ చంధమో తెలియదు.
మీ సాహితీ తృష్ణకు అభినందనలు.

A K Sastry said...

డియర్ vookadampudu!

ఇంకో మంచి సమస్యా పూరణాన్ని గుర్తు చేసినందుకు చాలా సంతోషం.

'....జపానుశీల.....' అనే ప్రయోగం నభూతో!

ధన్యవాదాలు!