ఋక్కులు
కుక్కపిల్లా,
అగ్గిపుల్లా,
సబ్బుబిళ్ళా-
హీనంగా చూడకు దేన్నీ!
కవితామయమేనోయ్ అన్నీ!
రొట్టెముక్కా,
అరటితొక్కా,
బల్లచెక్కా-
నీవేపే చూస్తూ ఉంటాయ్!
తమలోతు కనుక్కోమంటాయ్!
తలుపుగొళ్ళెం,
హారతిపళ్ళెం,
గుర్రపు కళ్ళెం-
కాదేదీ కవితకనర్హం!
ఔనౌను శిల్పమనర్ఘం!
ఉండాలోయ్ కవితావేశం!
కానీవోయ్ రసనిర్దేశం!
దొరకదటోయ్ శోభాలేశం!
కళ్ళంటూవుంటే చూసి,
వాక్కుంటే వ్రాసీ!
ప్రపంచమొక పద్మవ్యూహం
కవిత్వమొక తీరని దాహం!
--శ్రీశ్రీ, 14-4-1934
--శ్రీశ్రీ, 14-4-1934
--కాకతాళీయంగా ఈరోజు ఋక్కుల 75వ పుట్టినరోజు!
రా.వి.శాస్త్రి శైలి
శ్రీశ్రీగారు తమ కవితలో ప్రకటించిన ఋక్కులకు శ్రీ రాచకొండ విశ్వనాధ శాస్త్రి గారు రూపకల్పన చేసి కాదేదీ కవితకనర్హం అన్న కవివాక్కుని రుజువు చేశారు.
ఒక్కొక్క ఋక్కుకీ ఒక్కొక్క కథ రాసి, శ్రీశ్రీ గారికి అంకితమిచ్చేరు.
ఆ ఋక్కులలోంచి రావిశాస్త్రిగారి శైలికి ప్రతీకలైన ఈ క్రింది భాగాలని ఉటంకిస్తున్నాను.
చదవండి!
'---మానవ సంఘంలో న్యాయ నిర్ణేతలు కూడా మానవత్వాన్ని కోల్పోతారనే విషయం అతనికి ఇంకా అర్ధమూ కాలేదు. ఆనుభవం లోకి రానూ లేదు.
ఏ దేశంలోనైనాసరే ఎక్కడైనాసరే, ఏఖుషీకుర్చీల్లో ఎంత గంభీరంగా ఉండ ప్రయత్నించినాసరే, నునుమెత్తని పులుల్లావుంటారు. అందమైన తోడేళ్ళల్లా వుంటారు. లేదా దుక్కబలిసిన గుంటనక్కల్లా వుంటారేతప్ప, జడ్జిలెవరూ దయగల మనుషుల్లా వుండరు (అనిన్నీ); ఏదేశంలో ఎక్కడికివెళ్ళిచూసినా సరే సరసరలాడే తాచులాగో, పడగెత్తిన నాగులాగో లేక, తోక మీద నిలబడి, నడిచే జెర్రిపోతులాగో ఉంటాడేతప్ప ఏప్లీడరూకూడా మనిషిలా మాత్రం ఉండడు ఛస్తే వుండడు (అనిన్నీ); ఏదేశంలో ఏమారుమూల ఏకోర్టుకి వెళ్ళి చూసినప్పటికీ అక్కడ కనిపించే పొలీసులూ, బంట్రోతులూ, గుమస్తాలూ అంతా కూడా పీడించడానికి యముడుపంపిన స్పెషల్ టైపు పిశాచాల్లా ఉంటారేతప్ప మనుషుల్లా కనిపించరు, మనుషుల్లా ప్రవర్తించరు (అనిన్నీ); ఏదేశంలోనైనాసరే ఎంతమంచి ఉన్నతన్యాయస్థానమైనాసరే దాని ఆవరణలో ఎంతమంచి పూలమొక్కలు పెంచినా వాటిని విష పుష్పాలుతప్ప వేరేమీ వికసించవు (అనిన్నీ); అక్కడ ఎంతమంచి చెట్టు ఎంతబాగా ఎదిగినప్పటికీ అది ఆకొక నాలికగాగల వింతరాక్షసిలా ఉంటుందితప్ప చల్లని చెట్టులావుండదు (అనిన్నీ); అక్కడ ఏపచ్చని తీగెసాగినా అది పసరికపాములా ఉంటుందేతప్ప నునులేత పూదీగెలా ఉండదు (అనిన్నీ); అక్కడ పచ్చటి పచ్చిక పరిస్తే అది పచ్చటి నివురుగప్పిన నిప్పుల తివాసీలా ఉంటుందే తప్ప మరోవిధంగా వుండదు (అనిన్నీ); అక్కడ మానససరోవరంలాంటి మంచినీటి చెరువు తవ్వితే అది అభాగ్యుల్ని మింగేసే ముసలి మొసలి గొయ్యిగా కుంచించుకు పొతుందేతప్ప చెరువుగా నిలవదు (అనిన్నీ); అన్నెం పున్నెమెరుగని అమాయకపు చిలకల్ని అక్కడికి తెచ్చి పెంచితే అవి అక్కడ గెద్దల్లా ఎదుగుతాయి. చిలకల్నే చంపుతాయి (అనిన్నీ); అక్కడ తెల్లని మల్లెపూల మనసులు నాటితే అవి బ్రహ్మజెముడు డొంకలుగా ముళ్ళు ముళ్ళుగా చావుచీకటిగా పెరుగుతాయి (అనిన్నీ); నాలికలతో నిజంతప్ప వేరేదీ ముట్టరానివారికి అక్కడికి వచ్చీరాగానే వెయ్యి విషజిహ్వలొస్తాయి (అనిన్నీ); అక్కద చల్లటి నీడ ఉన్నప్పటికీ అది ఎండని మింగిన కొండచిలవలా ఉంటుందేతప్ప తాపమార్చి ప్రాణమిచ్చే నీడలా ఉందదు (అనిన్నీ); అక్కడ ఎండ ఉన్నప్పటికీ అది నీడని చంపి నిప్పులు చిమ్మే రక్కసి డేగల పెనురెక్కల విసురులా ఉంటుందే తప్ప దివాకరుడి దివ్యాతి దివ్యమైన అనుగ్రహంలా వుండదు (అనిన్నీ); అక్కడ భగవంతుడు పుట్టించినదేదీ భగవంతుడు పుట్టించినట్టుగా ఉండదు (అనిన్నీ); అక్కడ దేముడే వెలిస్తే అతడు ఠారున చచ్చి అక్కడ తప్పక దెయ్యమే అవుతాడు (అనిన్నీ); ఏ దేశంలో ఏ కోర్టులో అయినాసరే తడిగుడ్డలు చల్లగా గొంతుకలు పిసుకుతాయి ప్రాణాలు తీస్తాయి తప్ప బాహాటంగా కత్తులు రాపాడవు గదలు ఢీకోవు (అనిన్నీ); ఏ దేశంలో ఏకోర్టులో ఎవరు నవ్వినప్పటికీ ఆ నవ్వు రాక్షస వృశ్చికాలు తోకలతో నవ్వినట్టుంటుందే కాని మానవత్వాన్ని సూచించే మనిషి నవ్వుగా సహజంగా నిర్మలంగా నిష్కల్మషంగా ఉండదు (అనిన్నీ); ఏ దెశంలో ఏ కోర్టయినా సరే అది ఎంత చక్కగా ఎంత మంచి పాలరాతితో ఇంద్రభవనంలా స్వర్గహర్మ్యంగా మలచినప్పటికీ అది వెన్వెంటనే గుండె లేని గోరీగా మారి తీరుతుంది (అనిన్నీ); ఆ కోర్టు ఎంత "కళ" గా ఉన్నప్పటికీ ఎప్పుడూ తొడతొక్కిడిగా శవాల హడావిడిగా ఉండే శ్మశానంలా ఉంటుందే తప్ప ఇంకో విధంగా ఉండదు (అనిన్నీ); ఏడ్చే దౌర్భాగ్యులు తప్ప అక్కడ వేరెవరూ మనుషుల్లా ఉండరు (అనిన్నీ);
పైడ్రాజుకి అప్పటికింకా సరిగా తెలియదు.
------------------------------------------------------------------------------------

ఇది ఋక్కుల పేరిట "తలుపు గొళ్ళెం" కథలోది. చూశారా--ఎంత విపులంగా, వివరంగా, వ్యంగ్యంగా, (తాను ఒక అడ్వొకేటు అయ్యుండీ) నిర్మొహమాటంగా కోర్టుల గురించి వర్ణించారో! దటీజ్ రావిశాస్త్రి!
--సాహితీకృష్ణ
------------------------------------------------------------------------------------
2 comments:
నమస్కారం మావయ్యఘరు...
మీరు పొస్త్ చేసిన రవి సాస్త్రి గారి వర్నన చదివాను...
ఆఖరి వక్యంలొ "పైడ్రజుకి అప్పటికింకా సరిగా తెలియదు" అని ఉంది .
అంటె రాజు ఖొర్టు గొల్లెం తీస్తేనెకాని తనకి ఖొర్టు అసలు స్వరూపం తెలియలేదు అన్నదే కద రవి గారు చెప్ప తలచినది?
కరెక్ట్ చైతూ!
గొళ్ళెం తియ్యడమే కాదు--కేసుల్లో పండి పోయాక, కోర్టుల మీద 'అథారిటీ' అయిపోతారెవరైనా--అని కూడా చెప్పడం!
Post a Comment