Sunday, July 12, 2020

సాహిత్యం -- గ్రంథాలూ

బుచ్చి బాబు కథలు--
ఆ ఉ ఓ లు
“............ఆ ఊళ్లో రోడ్డు ప్రక్కన చాప మీద పరచిన పాత పుస్తకాల వ్యాపారసంస్థను చూసి ఆశ్చర్య పడ్డాను.........
పుస్తకాలు ఈతాకుల చాపమీద పరిచి వున్నాయి. మధ్యన ఒక గల్లాపెట్టెలాంటిది వుంది. గజం దూరం లో ఎలక్త్రిక్ దీప స్తంభం, మడిచేసిన ఒక గొడుగు, మిగతావి పాత పుస్తకాలు. అవన్నీ నిజంగా పాత పుస్తకాలే. పాతవే కాదు, ప్రాచీనమైనవి కూడా. అన్నీ తెనుగు గ్రంథాలే. కొన్నింటికి అట్టలే లేవు, పమిటకొంగులేని చీరలా; కొన్నింటికి మధ్యకుట్టిన కంతలు తప్ప దారం లేదు. కొన్ని తుదిమొదళ్లు లేని, పుస్తక కళేబరాలు. కొన్నింటి పుటలు, కదిపితే్ పొడుం గా విడిబోతున్నాయి. కొన్నింటిలో అచ్చు కనిపించడం లేదు. మరికొన్ని లెదర్ బైండింగ్ లో వున్నా-యమధర్మరాజు చర్మం లా వాటి లోపల పుటల్లో సాలీళ్లు, బొద్దింకలు, నెమలీకలు, ఈగలు, దోమలు వీటి కళేబరాలు, పురావస్తు పరిశోధకుడికి పిచ్చెత్తించేవిగా వున్నాయి. ఎండకి ఎండి, వానకి తడిసి, కొనవూపిరితో పడి వున్నాయి చాలా పుస్తకాలు. అక్కడవున్న కొన్నిపుస్తకాల పేర్లు--'ముకుంద విలాసము', కస్తూరి రంగకవి 'సాంబ నిఘంటువు', బహుజనపల్లి సీతారామాచార్యులుగారి 'ప్రసన్న పారిజాతము', 'అలఘు కౌముది' అందమైన పేరు. మంత్రిప్రగడ భుజంగరావుగారి 'ఉత్తరరామ చరిత్ర', ఆ పెద్ద పుస్తకం క్రింద కన్నుమీటుతున్నది దాసు శ్రీరామ పండితులవారి 'తెలుగునాడు' అన్న కావ్యం. పుటలు తిప్పి చూశాను. బ్రాహ్మణశాఖలు మాట్లాడే వ్యవహారికాన్ని అనుకరిస్తూ 'అవ్షే', 'సూస్సివషే', 'బలే చౌడషే', 'కాదషే' లాంటి ఉదాహరణలున్నట్లు ఇప్పటికీ ఙ్ఞాపకమే.

ఆంగ్లకవి విలియమ్‌ కూపర్ రచించిన జాన్‌ గిల్పిన్‌ అను హాస్య కావ్యానికి 'దుర్మార్గ చరిత్రము' అన్న తెలుగు అనుసరణ నన్నాకర్షించిన మరో పుస్తకం. దౌల్తాబాదు హనుమాయమ్మగారి 'మన్వంతరము', గంగతపల్లె శంకరరావు గారి 'భారత సారము' అను గద్యము, గాడిచర్ల హరిసర్వోత్తమ రావుగారు అబ్రహమ్‌ లింకన్‌ గూర్చి వ్రాసిన 'విస్మృత రాజకవి' అను గ్రంథం. 'వైశాఖ' పత్రికలు--బైండు చేసిన సంపుటాలు, అవటపల్లి నారాయణరావుగారి 'విశాలాంధ్రము' సీరము సుభద్రమ్మగారి నవల 'జాగిలం' ఇంకా 'త్రిపురాంతక శతకం', 'కాశీమజిలీలు' మూడవ భాగం. నాకు ఙ్ఞాపకం ఉన్నంతవరకూ ఇలాంటివి అక్కడున్న పాతపుస్తకాలు. అవన్నీ యాభై అరవై ఏండ్లనాటి పుస్తకాలు. వాటినిగురించి నాకేమీ తెలియదు. వాటిల్లో దేన్నీ నా జీవితం లో చదవను. కాని అవి ఉన్నాయని తెలుసుకుని వాటి వెనకవున్న తెలుగు సాహితీ సంప్రదాయాన్ని తల్చుకుని ఆనాటి రచయితల్ని అభినందించకుండా ఉండలేను. ఎన్నో చెత్తపుస్తకాలు వస్తేనేగాని, ఒక మంచి పుస్తకం రాదంటారు. సమకాలిక గ్రంథాల విలువల పరిశీలనకి అవి గీటురాయి. కాని వాటిని చెత్తపుస్తకాలు అనడానికి కూడా నాకు అర్హత లేదేమో.ఆ పుస్తకాలలో వస్తువుమీద, అవి వ్రాసిన వారిమీదా మనస్సు పోవనారంభించింది. ప్రస్తుతాన్నుండి, వెనకటి రోజులకు పారిపోవాలనిపిచింది. నాకా ఊళ్లో కర్మాగారాలు, విద్యుత్ దీపాలు, మరలు, లారీలు, సిమెంట్ కట్టడాలు నచ్చలేదు. బాల్యం లో నే ఎరుగున్న చెరువులో తామరాకులు, కాలవలో గేదెలని కడుగుతూ గేదెపై స్వారీచేస్తూ పాడుకుంటున్న పశువులకాపరీ శ్రీరామనవమినాడు పందిట్లో హరికథలూ, మర్రిచెట్టుక్రింద పల్చటి చందమామ ఆకులమధ్య కనబడుతూ, ఇలాయిబుడ్ల వెలుగులో ప్రాణాలుతోడే వూపుతో సాగే గొల్లసుద్దులూ, చల్లటి పూరిపాకలు, తరవాణి కుండలూ, చెట్లనీడలో పొడుం పీలుస్తూ పెద్దల చదరంగపుటెత్తులూ నాకవే ఇష్టం. ఆ జీవితం ఆ పుస్తకాల్లో ఉంది . పాత పత్రికల సంపుటాల్లో గోదావరి మీద వంతెన వేయడం, మొదటి రైలు వెళ్లడం వార్త చూశాను. గతానికీ నాకు లంకె ఆనాటిపుస్తకాలు, పత్రికలు................

ఇది బుచ్చిబాబు కథ లోని "ఆ ఉ ఓ లు" కథ లోని కొంత భాగం.
ఎందుకు వ్రాశానంటే, కొంతమంది ఈ మధ్య, తమ చిన్నప్పటి ఙ్ఞాపకాలూ, ఆటలూ ప్రచురించి మురిసిపోతున్నారు. బాగానే ఉంది.
ఇంకొంతమంది, ఫలానా కవి/రచయిత అంటూ, వారి జయంతులకీ, వర్థంతులకీ పోస్టులు పెడుతూ, వాళ్లు ఫలానా ఫలానా కావ్యాలూ, నవలలూ, శతకాలూ వగైరాలు పుంఖానుపుంఖాలుగా వ్రాశారు అని ఉట్టంకిస్తూ ఆనంద పడుతుంటారు.

నేనన్నది--అలా లిస్టు వ్రాయడం కాదు--ఆ పుస్తకాలలో, కనీసం ఒకటి రెండు ఐనా సంపాదించండి. ఇతరులకి అందించండి అని.
అలా చేస్తే, బుచ్చిబాబు పాత పుస్తకాల దుకాణం లో చూసినట్టు వ్రాసిన పుస్తకాలన్నీ ఇప్పుడు లభ్యం అయి ఉండేవి కదా? (కాశీమజిలీ కథలు ఇప్పుడు లభ్యం అవుతున్నాయి. సంతోషం.)

మిత్రుడు పి టి ఎస్ కె రాజన్‌ తన బ్లాగులో ఉదహరించిన పుస్తకాలన్నీ దాదాపు లభ్యం అవుతున్నాయి. కానీ, నన్నయ దగ్గర నుంచీ, పోతన దగ్గర నుంచీ--నేటి గరికిపాటి వారు, కడిమిళ్ల వారి వరకూ--ఫలానా ఇన్ని పుస్తకాలు వ్రాశారు అని చెప్పుకోవడమే గానీ, వాటిలో ఎన్ని లభ్యం అవుతున్నాయి?
ఇప్పటికైనా ఎవరైనా పూనుకుంటే, భావితరాలకి కొన్నైనా అందించగలం!
ఆలోచించండి!

Friday, September 20, 2013

అప్పటికీ, ఇప్పటికీ

క్షణంలో సగం

--శ్రీరంగం శ్రీనివాసరావు

(ఇది--ఆంధ్ర జ్యోతి మాసపత్రిక, 1949 ఏప్రియల్--ఉగాది సంచికలో ప్రచురించబడింది. తరువాత ఇంకెక్కడైనా ప్రచురించారో లేదో నేను చూడలేదు.)

ఒక సాయంత్రం (వాడి పేరు చెప్పను) కనబడ్డాడు. 

"బయల్దేరు" అన్నాడు. ఎక్కడకని అడిగి లాభంలేదు వాడితో. హఠాత్తుగా అలాగే ఎన్నోసార్లు కనబడి ఏవో ప్రతిపాదనలు చేస్తూ వుంటాడు. నేను మారుమాట లేకుండా వాటిని శిరసావహిస్తూ ఉంటాను. "అనుభవం జ్ఞానానికి జనకుడు" అంటే నేను నమ్మను. అలాగే "అవసరం సృష్టికి జనని" అనే సుభాషితంలోకూడా నాకు నమ్మకంలేదు. అంటే పూర్తిగా నమ్మకం లేదనాలి. అవన్నీ సగం సత్యాలు కాబట్టి సగం సగం మాత్రమే నమ్ముతాను.

ఇద్దరం బయలుదేరిన తర్వాత వీడు (ఎవరి పేరైతే చెప్పదలచుకోలేదో వాడు) "ఇప్పుడు మనం లక్షాధికారులం కావడం ప్రారంభిస్తున్నాం. తక్షణమే! జోరుగా నడు" అన్నాడు. ఇద్దరం తక్షణం ప్రారంభించాం. కాని ఆ ప్రారంభం ఇప్పటికీ ప్రారంభదశలోనే ఉండి పోయింది. అప్పుడు బయల్దేరిన మేము ఇంకా బయల్దేరుతూనే ఉన్నాం.

*   *   *

ఈ సాయంత్రం ఇక్కడ ఈ నగరంలో.....సముద్రంలాంటి ఆకాశంలాంటి ఎడారిలాంటి ఆకాశంలాంటి సముద్రంలాంటి ఎడారిలాంటి ఎడారి, సముద్రంలాంటి ఎడారి, ఆకాశంలాంటి ఎడారి, ఎకసక్కెంలాంటి ఎడారి........

ఇక్కడ ఈ నగరంలో ట్రాం లో నేను......ఎదురుగుండా సెలూన్లో అద్దంలో నేను : అదైనా క్షణంలో సగంసేపు!

అదీ అసలు సంగతి. ట్రాంలో వెళుతున్న నేను సెలూన్లో అద్దంలో క్షణంలో సగంసేపు నన్ను నేను ప్రతిబింబించి నాకు నేను కనిపించాను. క్షణంలో సగంసేపు ఒకేసారి సెలూన్లోనూ ట్రాంలోనూ నివసించాను.

ఇక్కడ ఈ సాయంత్రం........ఎడారిలో ఆకాశంలో క్షణంలో సగంలో ట్రాంలో సెలూన్లో జనం మధ్య జనసముద్రమ్మధ్య జనసముద్రం మధ్య నేను.

ఇక్కడ ఈ నగరంలో  ఈ క్షణంలో సగం సేపు ఏమిటి జరుగుతోంది?

*   *   *

"మనం లక్షాధికారులం కావడం ఎప్పుడు ప్రారంభిస్తాం" అని ప్రశ్నించాడు నయనకన్ను. వాళ్లిద్దరూ నాయరు దుకాణంలో నిన్నటి పకోడీలు నములుతున్నారు."ఇదిగో ఈ క్షణం" అన్నాడు దొరసామి. "టీ తీసుకున్న తక్షణం."

"డబ్బులు చాలుతాయా" అన్నాడు నయనకన్ను.

నాయరు రెండు గ్లాసులతో టీ తెచ్చి--వాళ్లముందుంచి పోయాడు.

"గుర్రాలు మోసం చేశాయని చెబుదాం. అరువుంటాడు నాయరు" అన్నాడు దొరసామి.

*   *   *

అక్రమ లాభాలమీద అదనపు పన్ను తగ్గింపు. ఆర్థిక పరిస్థితిమీద కేంద్ర ప్రభుత్వపు దండయాత్ర కృషి. ఇతోధిక కృషి. ద్రవ్యోల్బణము. దాని నరికట్టుటకు ఆరు మార్గాలు. రామపాదాల పీత నడక. అన్నివేళలూ తేనీటి వేళలే.

*   *   *

కాకెమ్మ చక్కని చుక్క. నిజంగా ఆ పేరుకి తగ్గదికాదు. పదేళ్ల కిందట మరీ బాగుండేది. అప్పుడు సినీమాలో నటించడానికిక్కడకు వచ్చింది. ఒక కెమేరా మనిషి ఆమె శరీరాన్ని అనేక కోణాలనుంచి చూసి చవిచూసి 'నువ్వు మంచం మీదకే కాని తెరమీదకి పనికిరా'వన్నాడు. దరిమిలాను చాలామంది ఆ అభిప్రాయాన్ని స్థిరపరిచారు. ఇప్పుడు కాకెమ్మ ఇంకో మంచం మీదకి వెళ్లబోతూంది.

*   *   *

దశవర్ష ప్రణాళిక బుట్టదాఖలా. బంగారం ధర పడిపోవడంవల్ల బ్యాంకులకి మూడురోజులు సెలవు. ఈ రాత్రి చంద్రుడు నూటికి 75 వంతుల నష్టంతో వ్యవహరిస్తాడు. అనుకోని గుర్రాల ఆకస్మిక విజయం.

*   *   *

జమీందారు సొంతకారు నడుపుకుంటూ జోరుగా పోతున్నాడు. స్వరాజ్యం వచ్చిన తర్వాతనో అంతక్రితం ఆరేడు నెలల పూర్వమో జమీందారు జాతీయ మతం తీసుకొని దీక్షావస్త్రాలు ధరించాడు.

పేవ్ మెంటుమీద నడుస్తున్న కుర్రాడు జమీందారును చూశాడు. కుర్రాడి జేబులో వేడివేడి వేరుసెనగపప్పుంది. పిడికిటి నిండా వేరుసెనగపప్పు తీసుకొని పట్టుకున్నాడు. కద్దరు దుస్తులతో కనుపండువుగా కనబడుతూన్న జమీందారుని వెరుసెనగ పప్పుతో అభిషేకించాలన్న ఆశ ఆ కుర్రాడి మనస్సులో మెరుపులాగ మెరిసింది. కాని ఒక నిశ్చయానికి రాలేకపోయాడు. కారు జోరుగా దాటిపోయింది.

*   *   *

జగద్విఖ్యాతి వహించిన షేక్స్పియరు మహాకవి నాటకం హేమ్ లెట్. మనస్సు స్థిరపరచుకోలేకపోయిన మానవుని విషాదాంత గాధ.

*   *   *

"ఉప్మా పట్రా" అన్నాడు. పట్టుకొచ్చాడు అయ్యర్వాళ్. తింటున్నాడు తెమ్మన్నవాడు. అందులో రెండు రాళ్లున్నాయి. కాఫీ తీసుకోకుండానే బిల్లు తీసుకొని డబ్బు చెల్లిస్తూ "ఉప్మాతోబాటు రెండు రాళ్లు ఎక్కువగా ఇచ్చాడు. అంచేత వాటికి నా యథాశక్తి ధర రెండర్థణాలు ఒక అణా చెల్లిస్తున్నా" నని అణా ఎక్కువ ఇవ్వబోయాడు. నేతాజీ విలాస్ కాఫీ క్లబ్బు (ఇక్కడ పదార్థాలు కల్తీలేని నేతితో చెయ్యబడవు) ప్రొప్రయిటరు అణా వైపు అతి భయంకరంగా చూశాడు. "ఎవరైనా బిచ్చగాడికి ధర్మం చేసుకో" అన్నాడు. రాళ్ల ధర చెల్లించదలచుకున్న మనిషి అణాకాసుని జేబులో వేసుకొని రెండు అయిదు రూపాయల నోట్లు బల్లమీదపెట్టి వెళ్లిపోయాడు.

"వెర్రి వెధవ" అనుకున్నాడు ప్రొప్రయిటరు, రూపాయి నోట్లను దాచేస్తూ.ఆ సమయంలోనే ఒక అణాకాసు అడుక్కునే అమ్మి డబ్బాలో పడ్డ చప్పుడయింది.

*   *   *

"కమ్యూనిస్టులను పాతేస్తున్నాం" అన్నారు దొరతనంవారు. పాతేస్తున్నారు. వానలు కురిస్తే దేశం అంతటా కావలసినంత పంట.

*************

(64 న్నర సంవత్సరాల తరువాత ఇప్పుడుకూడా నిన్ననో మొన్ననో వ్రాసినంత తాజాగా లేదూ ఈ కథ? ఆలోచించండి!)

Tuesday, October 16, 2012

తెలుగు నాటక సాహిత్యం

ఒక గొప్ప రచన

ముత్యాలముగ్గు సినిమాలో 'మాడా' - రావు గోపాలరావుతో బేరమాడుతూ, "మర్డరుకీ సెపరేషనుకీ యెంతవుద్ది, సెపరేషనుకీ మేరేజికీ యెంతవుద్ది, మర్డరుకీ, సెపరేషనుకీ, మేరేజికీ యెంతవుద్ది..........వోలుమొత్తానికి యెంతవుద్ది? కన్సెసనేమైనా వుందా?" అంటూ గుక్కతిప్పుకోకుండా చెప్పిన 'పొడవాటి ' డైలాగు గుర్తుందా?

అంతకు యాభయ్యేళ్ల క్రితమే ఓ నాటకంలో ఈ క్రింది సంభాషణని గమనించండి.

"అలాగైతే, సంబంధాల విషయంలో మీయభిప్రాయము ఏమిటో సంగ్రహముగా ముందు సెలవివ్వండి. మీకు కావలసింది చదువా? చక్కదనమా? సంపత్తా? సంప్రదాయమా? లేక చదువూ, సంప్రదాయమా? సంప్రదాయమూ సంపత్తా? సంపత్తూ చక్కదనమూనా? చక్కదనమూ చదువూ; చదువూ సంపత్తూ--ఈ విధముగా వుండవలెనా?"

ముళ్లపూడివారికి ఈ సంభాషణే స్పూర్తి యేమో!

ఈ సంభాషణ కాళ్లకూరి నారాయణరావుగారి "వరవిక్రయము" అనే నాటకం లోనిది.

1921 వ సంవత్సరంలో మొట్టమొదట ప్రచురింపబడి, తరువాత అనేక ముద్రణలు పొందుతూ, జాతీయోద్యమంలో భాగంగా కొన్నివేల ప్రదర్శనలకి నోచుకొన్న ఈ నాటకం మరుగునపడినా, అందులో విమర్శింపబడ్డ "వరకట్న దురాచారం" మాత్రం ఇంకా సమసిపోలేదు.

గురజాడవారు విమర్శించిన "కన్యా శుల్కం" అనే ఆచారం సహజ మరణం చెందడానికి కారణం, అప్పట్లో "విధవా వివాహాలు" చెయ్యవలసిరావడం జోరందుకోబట్టే, దానికి బ్రాహ్మణ్యం మింగలేక, కక్కలేక వూరుకోవడమే అనే వాదన నిజమే అనిపిస్తుంది.

కానీ, ఈ వరకట్నానికి సహజమరణం ప్రాప్తించేలా అన్ని కులాల్లోనూ యే ప్రక్రియా వూపందుకోకపోవడమే అది ఇప్పటికీ వర్ధిల్లడానికీ, వృధ్ధిపొందడానికీ కారణమేమో!

యేదైనా, ఈ నాటకాన్ని విరివిగా ప్రదర్శిస్తే కొంతలో కొంతైనా వుపయోగం వుంటుందేమో. ఇక కన్యాశుల్క నాటకాన్ని వదిలేసి, ఈ వరవిక్రయాన్ని మీడియావాళ్లూ, సాహితీపరులూ, సంస్కరణాభిలాషులూ తలకెత్తుకొంటే, యేమైనా వుపయోగముండచ్చేమో!

యేమంటారు?

(ఆ నాటకం లోని కొన్ని చక్కటి సంభాషణలు విడతలవారీగా ఇవ్వడానికి ప్రయత్నిస్తాను--మీరు చదవడానికి ఆసక్తి చూపితే.)

Sunday, May 20, 2012

బాపు సృష్టి.....

.....శ్రీరామరాజ్యం

మన టీవీ వాళ్ల పుణ్యమా అని, ఇవాళ (20-05-2012) వుదయం ఓ ఛానెల్లో "లవకుశ"; సాయంత్రం ఇంకో ఛానెల్లో "శ్రీరామరాజ్యం" రెండు సినిమాలూ చూడగలిగాను. (ఇంతవరకూ శ్రీరామరాజ్యం చూసే అవకాశం రాలేదు.)

లవకుశ సినిమాలో ప్రతీ ఫ్రేమూ ఇప్పటికీ నాకు గుర్తున్నా, మళ్లీ ఓ సారి పునశ్చరణ చేసుకొనే అవకాశం వచ్చింది.

ఇంక శ్రీరామరాజ్యం గురించి ఆ సినిమా విడుదల అయినప్పటినుంచీ అనేకమంది చేసిన వ్యాఖ్యలూ, సమీక్షలూ, పొగడ్తలూ, తెగడ్తలూ, వెకిలి విమర్శలూ.......అనేకం చదివాను, విన్నాను.

కానీ, చాలామంది పెద్దవాళ్లూ, పండితులూ కూడా దృష్టిసారించని, ప్రస్తావించని విషయం ఒకటి వుంది అందులో.

అది నిజంగా ఓ "దృశ్యకావ్యమే!"--ఇది అందరూ చేసినలాంటి పొగడ్త కాదు.

సాధారణంగా "రీమేకులు" ఒకసారి డబ్బుచేసుకొన్న కథని, ఇంకో భాషలో మళ్లీ డబ్బుచేసుకోడానికి తీస్తారు. మరి ప్రపంచ ప్రఖ్యాత బాపూ, రమణలకి ఆ అవసరం వుందా? ముమ్మాటికీ లేదు. అందుకే లవకుశని రీమేక్ చెయ్యలేదు వాళ్లు!

లవకుశని పూర్తిగా భక్తి భావంతో, ఇతిహాసం యెలా వుందో అలా చిత్రీకరించి, జనాల్లో భక్తి భావాన్ని రేకెత్తించినందుకు ఆ సినిమా విజయవంతమయ్యింది.

నిజంగా, ఇతిహాసం ప్రకారం, "రామరాజ్యం"లో, "సీతానింద" జరిగింది. దానిద్వారా, "శ్రీరామ నిందా" జరిగింది. అసలు దాన్ని "ఖండించడానికే" కంకణం కట్టుకొని,  వాల్మీకి వుత్తర రామచరిత వ్రాశాడన్నట్టూ, దానిద్వారా, కుశలవులచేత ఆ రామరాజ్యంలోనే ప్రచారం చేయించి, ఆ నిందలని దూరం చెయ్యడానికి ప్రయత్నించాడన్నట్టూ.......చాలా విపులంగా చెప్పారు!

అదీ ఆ సినిమా "హైలైట్"!

"అక్కడెక్కడో" లంకలో జరిగిన అగ్నిపరీక్ష గురించి, అయోధ్య ప్రజలకి యెలా తెలుస్తుంది? అందుకే నిందవేస్తున్నారు--అని చెప్పించి, దాన్ని చక్కగా డెవలప్ చెయ్యడం చాలా బాగుంది!

(అసలు అగ్నిప్రవేశ ఘట్టమే "ప్రక్షిప్తం"; వుత్తరరామ చరిత్రకోసమే అది సృష్టించారు అనేవాళ్లు కూడా వున్నారనుకుంటా).

(ఈ బ్లాగరు విధానం 'కాలింగ్ ఏ స్పేడ్ ఏ స్పేడ్' ప్రకారం అనేక లోటుపాట్లున్నాయి. కానీ, అవన్నీ--వారి దృష్టికి వచ్చినా, వ్యవధానంలేక, చూసీ చూడనట్టు వదిలేసినవే అని ఖచ్చితంగా చెప్పగలడు!)

శ్రీరాముడి మేకప్ గురించి కొంచెం శ్రధ్ధవహించవలసింది లాంటి విమర్శలన్నీ అలాంటివే. సీతాదేవిలో "ఐటం గర్ల్" యెవరూ కనపడలేదు. (భూమ్మీద బోర్లా పడుకొని, తన పళ్లన్నీ బయటపెడుతూ దుఃఖిస్తున్నప్పుడు మాత్రం అందవికారంగా వుంది.) ఇతరపాత్రలూ, పిల్లల నటనా, గ్రాఫిక్సూ, సమకాలీనంగా, బాగున్నాయి.

ఈ సినిమాని ఆంధ్రదేశం మొత్తం మీద, ప్రతీరోజూ, యేదో ఒక థియేటర్లో కొన్ని సంవత్సరాలపాటు ప్రదర్శిస్తూ, జనాలకి దాన్ని చూసే భాగ్యం యెవరైనా కల్పిస్తే సంతోషించేవాళ్లలో మొదటివాణ్ని నేను.

(టీవీలో యే ఛానెల్ అయినా అలా ప్రసారం చేస్తే ఇంకా బాగుంటుంది)

ఆ బాపూ రమణలకీ, జొన్నవిత్తులవారికీ నా పాదాభివందనాలు. (యేదైనా లోపం యెక్కువగా వుందంటే--అది ఇళయరాజా సంగీతమే!)

శుభంభవతు!

Sunday, March 11, 2012

వేదికలపై......

......వాక్ప్రవాహాలు

మీరెన్నయినా చెప్పండి......అతి సర్వత్ర వర్జయేత్!

ఈమధ్య అనేక సభలూ, సమావేశాల్లో, సన్మానాల్లో, వివిధ కార్యక్రమాల్లో మనం చూస్తూనే వున్నాము. స్వడబ్బాలు అంతగా లేకపోయినా, పరడబ్బాలూ, పరస్పర డబ్బాలూ యెక్కువై పోయాయి.

ప్రతీ వ్యక్తీ తన జీవితకాలంలో తగిన సాఫల్యం చెందాలనే తన ప్రయాణం ప్రారంభిస్తాడు. 

ఓ కళాకారుడైనా, కవీ, రచయితా, సినీ కవీ--ఇలా యెవరైనా అందుకు కఠోర దీక్షతో శ్రమిస్తారు. కానీ కొంతమందికే "సాఫల్యం"......యేదో ఒక రూపంలో లభిస్తుంది.

వుదాహరణకి, పింగళీ, ఆత్రేయా, వేటూరీ, సిరివెన్నెలా.....ఇలా అందరూ కొన్ని వేల పాటలు వ్రాశారు. ఫలానా పాటకి ఫలానాది స్పూర్తి...అని కూడా ప్రకటిస్తూ వుంటారు. 

వాళ్లు వ్రాసిన పాటల్లో నిజంగా "మంచి పాటలు" ఒక శాతం కూడా వుండవు. సమీక్షకులూ, విమర్శకులూ, సాహితీ బంధువులూ వగైరాలూ, వారి వెనుక జనసామాన్యం "మంచిపాటలు"గా గుర్తించినవి ఓ 2 నుంచి 3 శాతం వుండొచ్చు. 

రికార్డు కంపెనీలూ, క్యాసెట్ కంపెనీలూ, ఇప్పుడు సీడీ/డివీడీ కంపెనీలూ "హిట్"లుగా చెప్పేవి ఓ 5 శాతం వుండొచ్చు. 

కానీ, మిగిలిన వాటి సంగతేమిటీ? ఆ మాత్రానికి....అంత అవసరమా?  

ఆవేశంలో వచ్చినట్టే, వుద్వేగంలో మాటలొచ్చేస్తాయి-- 

సంతోషం ప్రకటించడానికి, కృతజ్ఞతలు చెప్పడానికి, పొగడ్డానికి--ఇలా ప్రవాహంగా వచ్చేస్తూ వుంటాయి!

మనసులో యేర్పడుతున్న ఆలోచనల గొలుసుకట్టుని వెంటవెంటనే మాటల్లోకి మార్చుకొని, చక్కగా వారి భావాలని శ్రోతలకి, మనసుల్లోకి చొచ్చుకొనిపోయేలా చెప్పడం అనేది--పుంభావ సరస్వతులకి మాత్రమే సాధ్యం!

కాళా తపస్వులకీ, ఎస్పీ బాలు లాంటివాళ్లకీ, సిరివెన్నెల లాంటి వాళ్లకీ, సుద్దాల అశోక్ తేజ, జొన్నవిత్తుల--ఇలా చాలా మందికి అది వుగ్గుతో అబ్బిన విద్య.

కానీ.......

అక్కడే సంయమనం అవసరం. 

చూసేవాళ్లకీ, వినేవాళ్లకీ "అంతుందా?" అనిపిస్తే, మీ నటన (అంటే ఇక్కడ పెర్ఫార్మెన్స్) యేమి సాధించినట్టు?

ఎస్పీ ఈ మధ్య కొంతవరకు సంయమనం పాటిస్తున్నాడు....ఇంతకన్నా నేను ఇంక యెక్కువ మాట్లాడను....అనేస్తున్నాడు. 

రెండు సంవత్సరాలుగా, శివరాత్రిరోజున, "పాడుతా తీయగా"కి తనికెళ్ల భరణి ని ఆహ్వానించి, ఆయన "తుస్....బుస్....ఖస్....శంకరా" అంటూ చదువుతున్న కవితలని బాగా మోసేస్తున్నాడు. సందేహం లేదు--భరణి అలౌకిక ప్రజ్ఞ కల కవీ, రచయితా. 

కానీ......

"హూష్.....
స్పేస్........
సుభాష్...
చంద్రబోస్ లా.....

అంతా ఖామోష్!"

ఇది వ్రాసిందెవరో గుర్తొచ్చిందా?

మరెందుకీ శషభిషలు?

"ఆయన నాకు తండ్రితో సమానం...వాడిక్కూడా తండ్రితో సమానం అంటున్నాడుకాబట్టి, వాడు నాకు సోదరుడితో సమానం....." ఇలా భాషణం సాగాల్సిన అవసరం వుందా?

పెద్దలు నామాటలని "విమర్శగా" కాకుండా, ఓ సలహాగా స్వీకరిస్తే సంతోషిస్తాను. 

ముఖ్యంగా......ఇలాంటివాటివల్ల కొన్నివర్గాల ప్రేక్షకులనీ, శ్రోతలనీ, సామాన్య జనాన్నీ దూరం చేసుకొంటున్నారని గమనిస్తే......ఇంకా సంతోషం!

గ్రహించండి.

Saturday, February 11, 2012

తెలుగు సాహిత్యం

సాహిత్యం అంటే....

(ఇదివరకటి నా టపా "చక్కని సాహిత్యం అంటే....ఇలా వుండాలి ట" కి కొందరైనా సాహితీపరులు స్పందిస్తారనుకున్నాను. అంతకు ముందు టపాలకి కూడా స్పందన లేదు....యెందుకో మరి)

కవీ, రచయితా, చిత్రకారుడు, ఇంకా చాలా అయిన "బహుముఖ ప్రజ్ఞావంతుడు" అడివి బాపిరాజు 1946 లో వ్రాసిన "కోనంగి" నవలలోనివి ఆ టపాలో వ్రాసిన పేరాలు.....అక్కడక్కడా సేకరించినవి.

ప్రతి పిచ్చిరాతా "సాహిత్యం"గా చెలామణి అయిపోతున్న ఈ రోజుల్లో, అలాంటి సాహిత్యం అరుదుగా కనిపిస్తుంది అనే ఉద్దేశ్యంతో మాత్రమే వ్రాశాను.

ఒక సమయంలో, సినీ పరిశ్రమలో అ, ఆ లు అంటే, "అక్కినేని, ఆదుర్తి" అనేవారు. అవేరోజుల్లో, అక్కినేని "అ ఆ లు" (అక్కినేని ఆలోచనలు) అనే పేరుతో కవితలు వ్రాస్తే, "వీడికి అదొక్కటే తక్కువ" అన్నవాళ్లున్నారు. 

ఇప్పుడొస్తున్న కవితలూ, తవికలూ, హైకూలు, నానీలు, నానోలు, తాతీలు, తాతూలు లాంటి "కవిత్వం" తో పోలిస్తే, అవి గొప్పకవితలు అనిపిస్తాయి.

అవి ఇప్పుడు యెక్కడైనా దొరుకుతున్నయో లేదో!